Mehbooba Mufti: భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP) అధినేత్రి మెహబూబా ముఫ్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఒక బాధ్యతాయుత నాయకుడిగా ముందడుగు వేసి, యుద్ధం ఆపేందుకు ప్రయత్నించాలని ఆమె కోరారు. తాజాగా ముఫ్తీ ఎక్స్ ద్వారా చేసిన పోస్ట్‌లో.. ప్రస్తుత సమయంలో భారత్ తన నిజమైన శక్తిని అణ్వాయుధాల్లో కాకుండా, శాంతి సిపి అడుగుయవలిసిన అవసరం ఉందని పేర్కొన్నారు. Read…
ఈ రోజు పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం పొందారు.. జమ్మూలో పాక్ జరిపిన కాల్పుల్లో జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే ప్రాణాలు విడిచారు.. సచిన్ యాదవ్ రావు వనాంజే వయస్సు 29 ఏళ్లు.. ఆయన స్వస్థలం మహారాష్ట్ర - తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్... సచిన్ యాదవ్‌రావు వనాంజే మృతితో తమ్లూర్‌లో విషాదచాయలు అలుముకున్నాయి..
Omar Abdulla : జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “భారత సరిహద్దులపై పాకిస్తాన్ షెల్లింగ్ చేయడానికి IMF డబ్బులు తిరిగి చెల్లిస్తోందా?” అంటూ ఆయన నిప్పులు చెరిగారు. సోషల్ మీడియా వేదిక X (ట్విట్టర్)లో ఒమర్ అబ్దుల్లా చేసిన పోస్ట్ సంచలనం రేపింది. పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థలు ఆర్థిక సహాయం అందిస్తూ, అదే సమయంలో ఈ ప్రాంతంలో శాంతిని ఎలా ఆశిస్తున్నాయని ఆయన నిలదీశారు. “పూంచ్,…
India Pakistan War: పాకిస్తాన్ వరుస దాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌ను మరోసారి బ్లాకౌట్ చేశారు. వరుసగా రెండో రోజు చీకటి పడగానే డ్రోన్లతో దాడికి పాక్ ప్రయత్నించింది. సుమారు 11 లొకేషన్లలో దాడులకు దిగింది పాకిస్తాన్.
భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాన్ వీరమరణం పొందాడు.. జమ్మూ కాశ్మీర్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జవాన్ మురళీ నాయక్ ప్రాణాలు విడిచారు.. పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు జవాన్ మురళీ నాయక్.. ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండా.. రేపు కల్లితండాకు మురళీ నాయక్ పార్థివదేహాన్ని తరలించేందుకు భారత ఆర్మీ ఏర్పాట్లు చేసింది..
Jammu Kashmir: ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి ప్రాంతంలో పాకిస్తాన్ సరిహద్దు షెల్లింగ్‌లో గురువారం ఒక మహిళ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు. ఈ సంఘటన గురువారం జరిగింది. ఇక అధికారుల ప్రకారం, రేజర్వానీ నుంచి బారాముల్లా వెళ్ళిన ఒక వాహనం మొహురా సమీపంలో శెల్లింగ్ దాడికి గురైంది. ఈ దాడిలో బశీర్ ఖాన్ భార్య నాగ్రిస్ బేగం అనే మహిళ ప్రాణాలు కోల్పోయారు. అలాగే రాజీక్ అహ్మద్ ఖాన్ భార్య మహిళ హఫీజా గాయాలపాలు…
జమ్మూ కాశ్మీర్‌లో రాత్రి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగినా.. ఉదయం పరిస్థితి సాధారణంగా ఉంది.. భారత వైమానిక రక్షణ విభాగాలు.. రాత్రిపూట పాకిస్తాన్ డ్రోన్లు మరియు క్షిపణులను అడ్డుకున్నాయి. పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రజల నివాస ప్రాంతాలపై దాడులకు పాల్పడింది.. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉన్న పాకిస్తాన్ సైన్యం.. ప్రజల కార్లను లక్ష్యంగా చేసుకుని కాల్పలకు తెగబడింది..
Big News : జమ్మూకశ్మీర్ ప్రజలు మరోసారి భయభ్రాంతులకు లోనయ్యారు. గురువారం సాయంత్రం జమ్మూ నగరంలోని విమానాశ్రయం (Jammu Airport) సహా ఏడు ప్రధాన ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలతో నగరంలో ఒక్కసారిగా ఆందోళన ఏర్పడింది. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై, సమగ్ర గాలింపు చర్యలు ప్రారంభించాయి. తాత్కాలికంగా నగరాన్ని బ్లాక్ అవుట్ చేయగా, ప్రజలకు ఇంట్లోనే ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తాజా సమాచారం ప్రకారం, జమ్మూ నగరంపై విధించిన బ్లాక్ అవుట్…
'ఆపరేషన్ సిందూర్'తో నిరాశ చెందిన పాకిస్థాన్.. భారతదేశంలోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఈ దాడిని తిప్పికొట్టింది. ఈ అంశంపై వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సమాచారం ఇచ్చారు. గత 24 గంటల్లో పాకిస్థాన్ సైన్యం భారతదేశాన్ని ఎలా లక్ష్యంగా చేసుకుందో వివరించారు. వారి ఎత్తుగడలు ఏవీ విజయవంతం కాలేదని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడం..
Pakistan Shelling : భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ అనంతరం, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రంలోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద పాకిస్తాన్ సైన్యం బుధవారం చేసిన ఘనమైన దాడులు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ దాడుల్లో 15 మంది పౌరులు మరణించగా, 43 మంది గాయపడ్డారు. ధ్వంసమైన ఇళ్లు, పగిలిన దుకాణాలు, దగ్ధమైన వాహనాలు, రక్తపు మరకలు, శిథిలాలతో సరిహద్దు గ్రామాలు భయానకంగా మారిపోయాయి. ఆలయాలు, స్కూళ్లు, మసీదులపై కూడా పాకిస్తాన్ సైన్యం షెల్లింగ్ చేసి దాడి చేసింది.…