ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనను ప్రధాని మోడీ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ చినాబ్ రైల్వే వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తుగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చినాబ్ సొంతం. అలాంటి రైల్వే వంతెనను ప్రధాని మోడీ శుక్రవారం జాతికి అంకింతం చేశారు.
ప్రధాని మోడీ శుక్రవారం జమ్ముూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈరోజు ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ వంతెనను మోడీ ప్రారంభించనున్నారు. రూ.46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు.
Caste Census Survey: కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు దశల్లో దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది అక్టోబర్ 1వ తేదీ నుంచి తొలి దశ కుల గణన చేపట్టడానికి ప్లాన్ చేస్తుండగా.. 2027 మార్చి 1వ తేదీ నుంచి రెండో దశ కుల గణన చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ప్రధాని మోడీ జూన్ 6న జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత తొలిసారి మోడీ జమ్మూకాశ్మీర్‌లో పర్యటిస్తున్నారు. శ్రీనగర్‌కు వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు.
పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాలలో గురువారం సాయంత్రం మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మాక్ డ్రిల్ గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూ కశ్మీర్‌లలో జరుగుతుంది. పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఈ నాలుగు రాష్ట్రాలలో ప్రభుత్వం మాక్ డ్రిల్‌లను ఆదేశించింది. దీంతో భారత సైన్యం ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటుందా?
జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో రెండో రోజు ఉగ్రవాదులపై కాల్పులు కొనసాగుతున్నాయి. చత్రోలోని సింగ్‌పోరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక జవాన్ వీరమరణం పొందాడు.
అవినీతి కేసులో సీబీఐ చర్య అనంతరం జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోగ్యం క్షీణించింది. గురువారం, మాలిక్ సహా 6 మందిపై సీబీఐ అధికారికంగా ఛార్జిషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఛార్జిషీట్ అనంతరం తాను ఆసుపత్రిలో చేరానని, తన పరిస్థితి చాలా విషమంగా ఉందని మాలిక్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. మాలిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేశారు.
Terrorists: పహల్గామ్ ఉగ్రవాద దాడితో వణికిపోయిన జమ్మూ కాశ్మీర్ ప్రజలను మరో సమస్య వెంటాడుతుంది. టెర్రరిస్టులు సైనికుల దుస్తులు ధరించి సంచరిస్తుండటంతో స్థానికులకు కొత్త సమస్య ఎదురవుతుంది.. దీంతో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తేడాను గుర్తించలేక అయోమయానికి గురవుతున్నారు స్థానిక ప్రజలు.
జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులను ఏరిపారేసేందుకు సెర్చ్ ఆపరేషన్ ను ఇండియన్ ఆర్మీ ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా షోపియాన్ జిల్లాలో జరిగిన ఒక సంయుక్త ఆపరేషన్‌లో భారత సైన్యం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఎన్కౌంటర్లలో 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు భద్రతా దళాలు పేర్కొన్నాయి. నిఘా వర్గాల సమాచారంతో ఆపరేషన్ పూర్తి చేసినట్లు ఫోర్స్ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి విలేకరులకు తెలిపారు.