Kolkata Doctor Murder Case: అత్యాచార నిందితుడికి జైల్లో.. మటన్, రోటీ?
- ప్రస్తుతం జైల్లో నిందితుడు సంజయ్ రాయ్
- నిన్న రాత్రి మటన్..రోటీ తిన్నట్లు సమాచారం
- ఆగ్రహానికి గురవుతున్న ప్రజలు
- నిందితుడిని వెంటనే ఉరితీయాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నాడు. సంజయ్ రాయ్ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ జైలులో సెల్ నంబర్ 21లో ఉన్నాడు. అయితే అతడికి సంబంధించిన ఓ సమాచారం బయటకు వచ్చింది. ఓ జాతీయ మీడియా సమాచారం ప్రకారం.. సంజయ్ రాయ్ నిన్న రాత్రి జైలులో మటన్, రోటీ తిన్నాడని సమాచారం. ఇది తెలుసుకున్న పలువురు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిందితుడిని జైల్లో కూర్చోబెట్టి మేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారుణ ఘటనకు కారణమైన సంజయ్ రాయ్ ని వెంటనే ఉరి తీయాలని లేదా ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
READ MORE: Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయంలో 30 మంది విద్యార్థులకు అస్వస్థత.. ఆరా తీసిన సీఎం చంద్రబాబు
Also Read
కాగా.. ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మహిళా ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో మొత్తం ఏడుగురికి పాలీగ్రాఫ్ పరీక్ష ప్రారంభమైంది. కోల్‌కతా లోని సీబీఐ కార్యాలయంలో నిందితుడు సంజయ్ రాయ్, ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్, ఘటన జరిగిన రాత్రి బాధితురాలితోపాటు నలుగురు వైద్యులను.. అలాగే, ఒక వాలంటీర్ లకు పాలిగ్రాఫ్ పరీక్షలు చేపడుతున్నారు. ఇకపోతే నిందితులు నిజాన్ని బయటపెట్టడానికి, పోలీసులు పాలిగ్రాఫ్ పరీక్షను నిర్వహిస్తారు. దీనిలో లై డిటెక్టర్ యంత్రం ద్వారా అబద్ధాలను గుర్తించే ప్రయత్నం చేస్తారు. ఇందులో నిందితుడి సమాధానం సమయంలో శరీరంలో సంభవించే మార్పుల ద్వారా, నిందితుడు ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇస్తున్నాడా లేదా అనేది నిర్ధారించబడుతుంది. ఈ పరీక్షలో నిందితుల శారీరక మార్పులని జాగ్రత్తగా స్టడీ చేసి, వారి ప్రతిచర్యను బట్టి సమాధానం నిజమో.. అబద్ధమో.. నిర్ణయించబడుతుంది
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు