Supreme Court: సెలెక్ట్ కమిటీ వ్యవహారంలో పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. ఈ విషయంలో రాజ్యసభ ఛైర్మన్‌ని క్షమాపణలు కోరాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. రాఘవ్ చద్దా సస్పెన్షన్ కేసులో ఈ రోజు కోర్టు విచారణ జరిపింది. ఎంపీ క్షమాపణలను సానుభూతితో పరిగణించాలని రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌ని సుప్రీం సూచించింది. విచారణ సమయంలో రెండు పక్షాలు ముందుకు వెళ్లే…
Zakir Naik: ఫిఫా ప్రపంచకప్ పోటీలను వీక్షించేందుకు వివాదాస్పద ఇస్లామిక్ బోధకుడు పీస్ టీవీ వ్యవస్థాపకుడు, ఇస్లామిక్ రిసెర్చ్ ఫౌండేషన్ (ఐఆర్‌ఎఫ్) అధినేత జకీర్‌నాయక్ ను ఆహ్వానించారనే వార్తలపై ఖతార్ వివరణ ఇచ్చింది.
Vice-President Election 2022: ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం రేపు పోలింగ్ జరనుంది. శనివారం పార్లమెంట్ భవనం మొదటి అంతస్తులోని రూం నెంబర్ 63లో పోలింగ్ జరగనుంది. సీక్రెట్ బ్యాలెట్ విధానం ద్వారా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉపరాష్ట్రపతి పదవి కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్, ప్రతిపక్ష పార్టీ కూటమి అభ్యర్థిగా మార్గరేట్ ఆల్వాను పోటీలో దించారు.
నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించిన పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్ రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించారు. మణిపూర్ గవర్నర్ లా. గణేశన్‌కు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నామివేషన్ వేయనున్నారు. శనివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి తరఫున అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే.
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తుండటంతో అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేపట్టిన బీజేపీ ఎట్టకేలక ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసింది. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జేపీ నడ్డా ప్రకటించారు.