Jagdeep Dhankhar: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ ధన్‌కర్ రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన నామివేషన్ వేయనున్నారు. శనివారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఎన్డీయే కూటమి తరఫున అభ్యర్థిగా జగదీప్ ధన్‌కర్‌ను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే. జులై 19తో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో రేపు ధన్‌కర్ నామపత్రాలను సమర్పించనున్నారు. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా ఉన్న జగదీప్ ధన్‌కర్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జేపీ నడ్డా ప్రకటించారు.
Opposition Vice president Candidate: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ అల్వా
1989 నుండి 1991 వరకు రాజస్థాన్‌లో ఝుంఝును నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ధన్‌కర్ పనిచేశారు. 1993 నుండి 1998 వరకు కిషన్‌నగర్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడిగా పనిచేశారు.రాజస్థాన్ రాష్ట్ర న్యాయవాదుల బార్ కౌన్సిల్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. 2019 జూలై 30న రాష్ట్రపతి కోవింద్‌చే పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా నియమించబడ్డారు.సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన జగదీప్ ధన్‌కర్ ఎట్టకేలకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిచారు. భారత 16వ ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఓటింగ్ ప్రక్రియ ఆగస్టు 6న జరగనుంది. అదేరోజు ఫలితాలు వెలువడుతాయి. ప్రస్తుత ఎం.వెంకయ్య నాయుడు పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. 11న కొత్త ఉప రాష్ట్రపతి బాధ్యతలు చేపట్టనున్నారు.
మరోవైపు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తమ అభ్యర్థిని ప్రకటించిన మరుసటి రోజే ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థి ఎవరనే ఉత్కంఠకు తెరదించాయి. ఈ ఎన్నికల్లో తమ ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ అల్వాను బరిలో దించుతున్నట్టు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆదివారం ప్రకటించారు. ఆమె కూడా త్వరలోనే నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.