Jagdeep Dhankhar says baseless remarks to have results: ఈడీ రైడ్స్‌పై తగిన ఆధారాలు లేకుండా సభలో ఆరోపణలు చేయొద్దని, అలాంటి ఆరోపణలు సభా హక్కుల్ని ఉల్లంఘించడంతో సమానమని.. రాజ్యసభ సభ్యులకు చైర్మన్ జగదీప్ ధన్‌కర్ హితవు పలికారు. దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని రాజ్యసభలో సోమవారం జీరో అవర్‌లో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. ధన్‌కర్ ఆ విధంగా రియాక్ట్ అయ్యారు. ‘‘సభలో ఎవరేం మాట్లాడినా, అది కచ్ఛితత్వంతో కూడినది అయ్యుండాలి. తగిన ఆధారాలతోనే మాట్లాడాలి. ఆధారాలు లేని గణాంకాల్ని సభలో చెప్తామంటే.. అనుమతించే ప్రసక్తే లేదు. ఇష్టానుసారంగా తోచింది మాట్లాడితే, సభా హక్కుల్ని ఉల్లంఘించడంతో సమానం అవుతుంది. పత్రికల్లో వచ్చిన రిపోర్టులు లేదా ఎవరో వెల్లడించిన అభిప్రాయాలకు ప్రాముఖ్యం ఇవ్వబోము. సభలో ఏదైనా ఆరోపణ చేస్తే.. అందుకు చట్టబద్ధ డాక్యుమెంటేషన్ ఉండాలి’’ అంటూ ఆయన ఉద్ఘాటించారు.
Hydershahkote Black Magic: హైదర్ షాకోట్ స్కూల్ లో క్షుద్ర పూజల కలకలం..
అంతకుముందు సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థల ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష నాయకులను వేధిస్తోందని మండిపడ్డారు. గత ఎనిమిదేళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా 3,000 సోదాలు నిర్వహించిందని.. కానీ, కేవలం 23 మందిని మాత్రమే దోషులుగా తేల్చిందని అన్నారు. ‘‘ఈడీ కేవలం ప్రతిపక్ష నేతలపైనే ఎందుకు సోదాలు నిర్వహిస్తోంది? 20 వేల కోట్ల మోసానికి పాల్పడ్డ నిరవ్ మోడీపై ఎందుకు మౌనం పాటిస్తోంది? నిరవ్ మోడీ, విజయ్ మాల్యా, లలిత్ మోడీ, వ్యాపమ్ స్కామ్‌లోని నేరస్తులపై ఎందుకు ఈడీ, సీబీఐ చర్యలు తీసుకోవడం లేదు? బీజేపీలో ఉన్న అవినీతి అధికారులపై ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు?’’ అంటూ సంజయ్ సింగ్ ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఆయన ఇల్లీగల్ మైనింగ్‌లో ఉన్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రెడ్డి బ్రదర్స్‌తో పాటు కర్ణాటకకు చెందిన పలువురు బీజేపీ నేతల పేర్లను సైతం తెరమీదకి తెచ్చారు. ఈ వ్యాఖ్యలపై ఎన్డీయే ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సభాపతిని కలుగజేసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఆయన పైవిధంగా స్పందించారు.
Andhra Pradesh: ఓడీ దాటుతున్నారు జాగ్రత్త.. ఏపీ సర్కారుకు RBI హెచ్చరిక