ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వంప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీఆర్‌సీ విషయంలో గత కొన్ని నెలలుగా ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతున్న ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పీఆర్‌సీని 23.29 శాతం ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ అమలుకానున్నట్లు తెలిపింది. పెండింగ్ డీఏలు జనవరి నుంచి చెల్లించనున్నారు.అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సీఎం ప్రకటనపై మాట్లాడారు. ఒకేసారి పెండింగ్ డీఏలన్నీ ఇస్తామన్నారు. ఈనెలలోనే పెండింగ్ డీఏలతో పాటు.. 2 వారాల్లోనే హెల్త్ కార్డులన్నీ ఇస్తామన్నారు. జీతం తగ్గే ప్రసక్తే లేదు. ఫిట్‌మెంట్ తగ్గిన మాట వాస్తవం అన్నారు.