ఇటీవల సీఎం జగన్ ప్రకటించిన పీఆర్సీపై విముఖత తో ఉన్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు సిద్ధమయ్యాయి. ఉద్యోగ సంఘాల నేతలు ఏకతాటిపై వచ్చి పీఆర్సీ సాధన కమిటీ గా ఏర్పడి సమ్మెకు సిద్ధమయ్యారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించేందుకు ఏపీ ప్రభుత్వం మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. అయితే మంత్రుల కమిటీ ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించినప్పటికీ ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం చర్చకు రాలేదు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. చర్చలకు రాకుండా ఉద్యోగులు ఎందుకంత పట్టుదలతో ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.
చర్చలకు రాకుంటే సమస్య మరింత జఠిలమవుతుందాని, హెచ్ ఆర్ఏ, ఐఆర్ అడ్జస్ట్మెంట్ సహా ఉద్యోగులు లేవనెత్తిన సమస్యలను వీలైనంత వరకు పరిష్కరించేందుకు సిద్ధమేనని ఆయన స్పష్టం చేశారు. ఉద్యోగులు మా కుటుంబంలో వ్యక్తుల లేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కుటుంబంలో వ్యక్తులు అలిగితే వదిలేస్తామా..? ఉద్యోగుల విషయంలోనూ అంతేనని ఆయన వివరించారు. సచివాలయంలో ప్రతి రోజు మధ్యాహ్నం 12 నుంచి అందుబాటులో ఉంటామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పీఆర్సీపై చర్చించేందుకు ఎవరు వచ్చిన సిద్ధమని ఆయన వెల్లడించారు.