రాష్ట్రంలో పేదలకు కడుతున్న ఇళ్ళపై సీపీఐ రామకృష్ణ విమర్శలకు మంత్రి బొత్స కౌంటరిచ్చారు. విశాఖలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. పిచ్చుక గుళ్ళు లాంటి ఇళ్లు కడుతున్నారని విమర్శిస్తున్నారు. పేదలకు ఇళ్ళు ఇస్తే మీకెందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు. హౌసింగ్ బోర్డు ప్రారంభమైన తర్వాత ఎప్పుడైనా ఇంతకంటే పెద్ద ఇళ్లు కట్టారా?
సిద్దాంతాల గురించి మాట్లాడే బీజేపీ, కమ్యూనిస్టులు ఒకే వేదికపైకి వస్తారు. వీళ్ళ మధ్యలో టీడీపీ.దాని వెనుక తోకపార్టీ జనసేన నడుస్తున్నాయన్నారు.ముందస్తు ఎన్నికలపై చంద్రబాబు వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఏమైనా చీఫ్ ఎలక్షన్ కమిషనరా…!?. బీజేపీకి అడ్వైజరా…!! జిన్నాటవర్, కేజీహెచ్ పేర్లు మార్చాలనే బీజేపీవి చీప్ ట్రిక్స్. అధికారంలో ఉన్నప్పుడు చేయలేని పనిని ఇప్పుడు తెరపైకి తేవడం దురుద్దేశ పూరితం.దానిని పూర్తిగా ఖండిస్తున్నాం అన్నారు మంత్రి బొత్స. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ అవినీతి జరిగిందని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. ఇళ్ల స్థలాల కోసం ప్రైవేట్ వ్యక్తుల నుంచి రూ. 10 వేల కోట్లతో ప్రభుత్వం కొనుగోలు చేస్తే.. రూ. 4 వేల కోట్ల అవినీతి చోటు చేసుకుందన్నారు సీపీఐ రామకృష్ణ.