ఏపీలో జగన్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ పూర్తయింది. కేబినెట్ కూర్పుపై మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్‌ది ఛాయ్, బిస్కెట్ కేబినెట్టేనంటూ యనమల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్నది ఛాయ్, బిస్కెట్ కేబినెట్. గతంలో జగన్ ది పప్పెట్ కేబినెట్ అయితే.. ఇప్పుడు ఛాయ్ బిస్కెట్ కేబినెట్ అన్నారు యనమల.
జగన్ కేబినెట్‌లో మంత్రులకు స్వేచ్ఛ లేదు. జగన్ కిచెన్ కేబినెట్టులోనో.. సలహాదారుల బృందంలో బీసీలు ఎందుకు లేరు..? నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీ.. కిచెన్ కేబినెట్టులో బీసీలకు ప్రాధాన్యత లేదన్నారు. ప్రాధాన్యత, పెత్తనం లేని పదవులిచ్చి.. ప్రాతినిధ్యం కల్పించామని ఎలా చెబుతారు..? ఈ కేబినెట్లో బడుగులకు ఎలాంటి ప్రాధాన్యత లేదు. బడుగులకు ఎంత మందికి చోటు కల్పించామనే దాని కంటే ఎంత ప్రాధాన్యత ఇచ్చారనేదే ముఖ్యం అన్నారు యనమల.
https://ntvtelugu.com/meeseva-charges-hike-in-andhrapradesh/
జగన్ కేబినెట్‌లో పాత బీసీ, ఎస్సీ, ఎస్టీలను తీసేసి.. కొత్త వారికి ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు ప్రాతినిధ్యమే కాదు.. ప్రాధాన్యత కూడా వచ్చింది.పవర్.. మనీ రెండూ జగన్ వద్దే ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు..? సీఎం సన్నిహితుడైతే మంత్రులను డిక్టేట్ చేస్తారా..? కేబినెట్‌లో బీసీలు ఉండాలి కాబట్టి.. ఇస్తున్నారంతే. జగన్ డెమొక్రాటిక్ డిక్టేటర్. చంద్రబాబు మాలాంటి వారితో సంప్రదింపులు జరిపేవారు.. ఆ తర్వాతే నిర్ణయాలు తీసుకునేవారు. జగన్ ఎవ్వరితోనూ సంప్రదింపులు జరపకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజల్లో వైసీపీ పట్ల నెగిటివ్ ఉంది.. అందుకే పార్టీలో కూడా కొంతమంది తిరగబడే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీలో ఒత్తిళ్లకు జగన్ లొంగక తప్పనిసరైంది. వైసీపీలో అసంతృప్తి మొదలైందని.. జగన్ పై తిరగబడుతున్నారని ఇటీవల జరిగిన పరిణామాల ద్వారా అర్ధమవుతుందన్నారు యనమల.