ఏపీ ప్రభుత్వం రైతులకు అన్నివిధాలుగా సాయం అందించేందుకు సిద్ధంగా వుందన్నారు అగ్రికల్చర్ స్పెషల్ సీఎస్ పూనమ్ మాలకొండయ్య. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ప్రారంభించాం. 26 రకాల పంటలకు బీమా సౌకర్యం ఉందన్నారు పూనం మాలకొండయ్య. పంటల బీమా ప్రక్రియ చాలా పారదర్శకంగా జరిగిందన్నారు.
ఈ-క్రాప్ విధానం ద్వారా పంట అంచనా, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. ఐదేళ్లలో రెట్టింపు సంఖ్యలో రైతులకు బీమా సౌకర్యం విస్తరించాం అని చెప్పారు. అన్ని రకాల ఉద్యానవన పంటలకూ బీమా వర్తిస్తుందన్నారు. కొర్ర, రాగి వంటి మిలెట్స్ కు కూడా పంట బీమా అమలు చేస్తున్నాం. ఖరీఫ్ కు పూర్తిగా సిద్ధంగా ఉన్నాం. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉండటానికి కారణం… గణాంకాలు దాయటం లేదు. రైతు ఆత్మహత్య మన రాష్ట్రానికే పరిమితం కాలేదన్నారు. పంటల బీమాపై రైతులకు అభ్యంతరాలు ఉంటే ఆర్బీకేలను సంప్రదించవచ్చు. వచ్చే 15 రోజులు విండో పిరియడ్ గా పెట్టాం.
గత మూడేళ్లుగా రైతు ఆత్మహత్యల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. సీసీఆర్సీ కార్డులు ఉన్న కౌలు రైతులతో బృందాలు ఏర్పాటు చేస్తున్నాం అని పూనం మాలకొండయ్య వెల్లడించారు. ఇటీవల సీఎం జగన్ 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం జగన్ బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమచేసిన సంగతి తెలిసిందే.
వ్యవసాయశాఖ కమిషనర్ హరి కిరణ్ మాట్లాడుతూ.. క్రాప్ హాలిడే ఎక్కడా ప్రకటించ లేదన్నారు. రబీ, ఖరీఫ్ కు మధ్య నిర్వహణ పనులకు సమయం తక్కువగా ఉంది. ఖరీఫ్ ఆలస్యం అయితే రైతులు మూడు విధాలుగా నష్ట పోతున్నారు. అందుకే మొదటిసారి ఒక నెల ముందుగానే నీళ్ళు విడుదల చేస్తున్నాం. క్రాప్ హాలీడే కాదు ముందస్తు పంట జరుగుతోంది. ఉప్పు నీటి ప్రాంతాల్లో ఎప్పుడూ పంట వేయరన్నారు హరికిరణ్.
Pakistan: ‘టీ’ తాగడం తక్కువ చేయండి ప్లీజ్.. ప్రజలకు పాక్ మంత్రి విజ్ఞప్తి