ఇటలీ లోని పోర్టోఫినోలో జరిగిన వేడుకల కోసం అనిల్ అంబానీకి కాబోయే కోడలు రాధికా మర్చంట్ బార్బీకోర్ ట్రెండ్ ను పాటించింది. రాధికా క్రిస్టియన్ డియోర్ డిజైన్ చేసిన ఆటం వింటర్ 1959 హాట్ కోచర్ సేకరణ నుండి వైవ్స్ సెయింట్ లారెంట్ రూపొందించిన హేట్ కోచర్ కాక్‌టెయిల్ దుస్తులను ధరించింది. క్రిస్టియన్ డియోర్ ఇంటి నుండి చాలా ఆర్కైవల్ దుస్తులు మ్యూజియంలలో ఉండగా, వాటిలో రాధిక ధరించిన దుస్తులు 2016లో వేలం వేయబడ్డాయి. అందులో ఆ…
PM Modi: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వచ్చింది. 543 సీట్లలో బీజేపీ కూటమి 293 సీట్లను కైవసం చేసుకుని మెజారిటీ సాధించింది. ఆదివారం రోజు మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రంలో ఎన్డీయే వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే గత రెండు ఎన్నికల మాదిరిగానే ఈసారి బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. కానీ ఎన్డీయే 292 సీట్లు గెలుచుకుంది.
ప్రముఖ వ్యాపారవేత్త ముకేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు దగ్గరపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రీ వెడ్డింగ్ వేడుకను రీసెంట్గా చాలా ఘనంగా జరిపారు. కాగా.. తాజాగా పెళ్లి వేడుకలను మొదలుపెట్టారు. వివాహ వేడుకలు మే 29న ఇటలీలో ప్రారంభమై జూన్ 1 వరకు జరుగనున్నాయి. ఈ వేడుకలు స్విట్జర్లాండ్‌లో ముగియనున్నాయి. అయితే.. ఈ వివాహ వేడుకకు బాలీవుడ్, అంతర్జాతీయ ప్రముఖులు ఎంతో మంది అతిరథ మహారథులు హాజరుకానున్నారు.
PM Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గురువారం ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ఫోన్‌లో మాట్లాడారు. జూన్‌లో ఇటలీలో జరిగే G7 సమ్మిట్‌కు ఆహ్వానం పంపినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపారు.
రైతుల నిరసనలు ఒక్క ఢిల్లీలోనే కాదు. ఫ్రాన్స్‌లో విదేశీ పోటీ నుంచి మెరుగైన వేతనం, రక్షణ కోసం డిమాండ్లు, జర్మనీలో వ్యవసాయ డీజిల్‌పై పన్ను మినహాయింపును దశలవారీగా తొలగించడం, ఇతర దేశాలలో ఈయూ పర్యావరణ నిబంధనలకు సవాళ్లు వంటి వివిధ కారణాల వల్ల యూరోపియన్ దేశాలు ఇటీవలి కాలంలో రైతుల నిరసనను చవిచూశాయి.
యూరప్‌కు ముఖద్వారమైన ఇటలీ భారతీయులకు తలుపులు తెరిచింది. భారత్, ఇటలీ ఇటీవల 'మైగ్రేషన్ అండ్ మొబిలిటీ' ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ఒప్పందానికి భారత మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. ఇటలీతో ఈ ఒప్పందం ద్వైపాక్షిక ఒప్పందాలను బలోపేతం చేయడమే కాకుండా అక్రమ వలసలను కూడా నిరోధించనుంది.
పెళ్లికి నిరాకరించిందని కూతురిని హత్య చేసిన పాకిస్తాన్ దంపతులకు మంగళవారం ఇటలీ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. నిశ్చితార్థం తర్వాత పెళ్లికి నిరాకరించడంతో సొంత కూతురినే చంపిన ఈ ఘటన 2021లో ఇటలీలో చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో పాక్ దంపతులకు కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే మృతురాలి తల్లి మాత్రం ఇప్పటికి పరారీలో ఉంది. వివరాలు.. పాకిస్తాన్ చెందని 18 ఏళ్ల సమన్ అబ్బాస్ ఇటలీలోని బోలోగ్నా సమీపంలోని…
Italy: చైనా తన వ్యాపార విస్తరణ, తన ఉత్పత్తులను అమ్ముకునేందుకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(BRI) ప్రాజెక్టును మొదలుపెట్టింది. అయితే కోవిడ్ పరిణామాలు, చైనాపై అపనమ్మకం, ఈ ప్రాజెక్టుపై భాగస్వామ్య దేశాల అనుమానాలు చైనాకు ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఐ ప్రాజెక్టు నుంచి కీలక దేశం ఇటలీ వైదొలుగుతున్నట్లు అధికారికంగా చైనాకు తెలియజేసింది. ప్రతిష్టాత్మక చైనా ప్రాజెక్టుపై సందేహాలకు నేటితో తెరపడింది.