ఇటలీలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇటలీలోని మిలాన్ నగరంలో ఓ ప్రైవేట్ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు. మిలాన్ లోని లినేట్ విమానాశ్రయం నుంచి సర్దీనియా దీవికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేట్ జెట్ సింగిల్ ఇంజన్ పీసీ 12 విమానం బయలుదేరిన వెంటనే ఇంజన్‌లో మంటలు అంటుకున్నాయి. ఆ విమానం ఓ భవనంపై కూలిపోయింది. దీంతో భవనంతో పాటుగా బయట పార్క్ చేసిన కార్లకు నిప్పు అంటుకున్నది.…
ప్రస్తుతం ప్రధాని మోడి అమెరికా పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అమెరికాలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్నారు. ఈరోజు అమెరికా నుంచి తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే, వచ్చేనెల 6,7 తేదీల్లో ఇటలీలో ప్రపంచ శాంతి సదస్సు జరుగుతున్నది. ఈ సదస్సుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఆహ్వానం లభించింది. అయితే, ఆ సదస్సుకు హాజరయ్యేందుకు కేంద్రం ఆమెకు అనుమతులు ఇవ్వలేదు. దీంతో మమతా బెనర్జీ మోడీపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోడి ఎక్కడికైనా…
అది అందమైన దీవి. ఇటలీలోని వెనీస్ నగరానికి కూతవేటు దూరంలో ఓ చిన్న దీవి ఉంది. ఈ దీవిపేరు పోవెగ్లియా. దీనికి అర్ధం సుందరమైన దీవి అని. కానీ, ఇటలీ ప్రజలు మాత్రం ఈ దీవిని దెయ్యాల దిబ్బగా పిలుస్తారు. ప్రజలు నివాసానికి అనుకూలంగా ఉన్నప్పటికీ, అక్కడ దీవిలోకి అడుగుపెట్టాలంటే గుండెలు జారిపోతాయి. అడుగడుగున భయంతో వణికిపోతారు. దీని వెనుక చాలా పెద్ద కారణం ఉన్నది. 16 వ శతాబ్దంలో ఇటలీలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. ఈ…
అనగనగా అదోక గ్రామం. ఆ గ్రామం చుట్టు పెద్దపెద్ద కొండలు.. దీంతో ఆ గ్రామంలోకి మూడు నెలలపాటు ఎంట కనిపించదు. సంవత్సరంలో మూడు నెలల పాటు ఆ గ్రామం ఎండపొడ లేకుండా చీకట్లో మగ్గుతుంది. దీంతో గ్రామంలోని ప్రజలు వినూత్నంగా ఆలోచించి సొంతంగా సూర్యుడిని ఏర్పాటు చేసుకున్నారు. దీనికోసం పలుచని స్టీల్ అద్దాలను వినియోగించారు. వాటిని కొండల పైభాగంలో ఏర్పాటు చేసి, సూర్యుడి కాంతికి అనుగుణంగా అవి తిరిగేలా రూపొందించారు. ఆయా అద్దాలపై పడిన సూర్యుని కాంతి…
భారత అథ్లెట్లు మైరాజ్ అహ్మద్ ఖాన్ మరియు అంగద్ వీర్ సింగ్ బజ్వా ఇద్దరు కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి వెయ్యి కిలోమీటర్లు ప్రయాణించి ఒక్క దేశం నుండి మరో దేశం వెళ్లారు. అయితే ప్రస్తుతం ఇటలీలో శిక్షణ తీసుకుంటున్న ఈ ఇద్దరు భారత షూటర్లు 2021 టోక్యో ఒలంపిక్స్ ను ఎంపికయ్యారు. కానీ అందుకోసం టోక్యో వెళ్లాలంటే తప్పకుండ వ్యాక్సిన్ తీసుకొని ఉండాలి. అయితే వీరు ఇప్పుడు శిక్షణ తీసుకుంటున్న ఇటలీలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో…
హైదరాబాద్ నగరంలో ఓ సైబర్ నేరగాడు రెండో పెళ్లి పేరుతో యాభై లక్షల రూపాయలను కాజేసాడు. భర్త చనిపోవడంతో రెండో పెళ్లి కోసం భారత్ మాట్రిమోనీలో జూబ్లీహిల్స్‌కు చెందిన ఓ మహిళ రిజిస్టర్ చేసుకుంది. ఇటలీలో తాను డాక్టర్‌నని, ఇక్కడే క్లినిక్ ఉందని, మాట్రిమోనీ సైట్‌లో ప్రొఫైల్ చూశానని ఆ మహిళను కేటుగాడు నమ్మించాడు. మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకొని హైదరాబాద్‌లోనే స్థిరపడదామని ఆ మహిళను కేటుగాడు ముగ్గులోకి లాగాడు. ఇటలీలో ఉన్న తన ఖరీదైన వస్తువులను…
గ్లామర్ గర్ల్ రాశి ఖన్నా ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య సరసన ‘థాంక్యూ’ సినిమాలో నటిస్తుంది. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగులన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. అయితే ‘థాంక్యూ’ మూవీ టీమ్ మాత్రం ఇటలీ వెళ్లి షూటింగ్ కంప్లీట్ చేసుకుని వచ్చింది. తాజాగా ఈ సినిమా ఇటలీ షూటింగ్ కష్టాలను బయటపెట్టింది రాశి ఖన్నా. ఆమె మాట్లాడుతూ.. కరోనా వేవ్ తాకిడి ఎక్కువ అవుతున్న వేళ ఇండియా నుండి బయటకు వెళ్లాలంటే భయం…