ఇటలీలో జరుగుతున్న జీ 7 సమ్మిట్ ఆద్యంతం సందడి.. సందడిగా సాగుతోంది. అగ్ర నేతలంతా ఇటలీలో ప్రత్యక్షమయ్యారు. దీంతో ఒకరినొకరు పలకరించుకుంటూ ఉత్సాహంగా సాగుతున్నారు. ఇక ప్రధాని మోడీ.. ఆయా దేశాధినేతలతో సమావేశం అయ్యారు.
గ్రూప్ ఆఫ్ సెవెన్ అని కూడా పిలువబడే జి 7 సమ్మిట్, ప్రపంచంలోని ఏడు అతిపెద్ద అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల నాయకుల వార్షిక సమావేశం. ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, భద్రత మరియు పర్యావరణ సుస్థిరతతో సహా విస్తృత శ్రేణి ప్రపంచ సమస్యలపై విధానాలను చర్చించడం, ఆపై సమన్వయం చేయడం ఈ శిఖరాగ్ర సమావేశం ముఖ్య ఉద్దేశ్యం. ఈ సదస్సులో పాల్గొన్న జి7 దేశాలు యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్…
ఇటలీలోని అపులియాలో జీ-7 సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఏడాదిలో ఇరువురు నేతల మధ్య ఇది రెండో సమావేశం. జీ7 సమ్మిట్ ఔట్రీచ్ సెషన్‌లో పాల్గొనడానికి ప్రధాని మోడీ ఈరోజు ముందుగానే ఇటలీలోని అపులియా చేరుకున్నారు. శుక్రవారం కార్యక్రమం సందర్భంగా పలువురు నాయకులను కలవనున్నారు. ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానికి ఇదే తొలి విదేశీ…
ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఫోటోగ్రాఫ్ కోసం సభ్యదేశాల దేశాధినేతలు ఫోజ్ ఇచ్చే సమయంలో వారి నుంచి దూరంగా వెళ్లిన బైడెన్ అభివాదం చేయడం వీడియోలో కనిపించింది.
Italy: ప్రతిష్టాత్మక జీ-7 సమ్మిట్‌కి ఇటలీ వేదిక అవుతుంది. ఈ సమావేశం కోసం ప్రధాని నరేంద్రమోడీతో పాటు జీ-7 సభ్యదేశాల దేశాధినేతలు ఇప్పటికే అక్కడి చేరుకున్నారు. వీరందరిని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సాదరంగా ఆహ్వానించారు.
మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధాని తొలి విదేశీ పర్యటనకు బయల్దేరారు. ఢిల్లీ నుంచి ఇటలీకి ప్రత్యేక విమానంలో బయల్దేరారు. శుక్రవారం ఇటలీలో జరిగే జీ 7 శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు.
Jairam Ramesh: ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇటలీకి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జూన్ 13-14 తేదీల్లో ఇటలీలోని అపులియా వేదికగా జరిగే జీ-7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు మోడీ అక్కడికి వెళ్తున్నారు.
నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జీ-7 దేశాల 50వ సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్తున్నారు. ఇటీవల మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోడీకిది తొలి విదేశీ పర్యటన కాబోతుంది.
ఇటలీలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు ధ్వంసం చేశారు. జీ7 సదస్సు కోసం ప్రధాని మోడీ ఇటలీ పర్యటనకు ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. ఖలిస్తాన్ మద్దతుదారులు హర్దీప్ సింగ్ నిజ్జర్ నినాదాలు సైతం కనిపించాయి.