పాలస్తీనా అనుకూల నిరసనలతో ఇటలీ అట్టుడుకింది. పాలస్తీనా రాజ్యాన్ని గుర్తించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నిరాకరించారు. ఓ వైపు పాలస్తీనా రాజ్యం ఏర్పాటుకు ఫ్రాన్స్, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్ మద్దతు తెల్పుతుండగా ఇటలీ మాత్రం అందుకు నిరాకరించింది.
సూపర్‌సోనిక్ స్కైడైవ్‌కు మార్గదర్శకుడు ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్(56) కన్నుమూశాడు. ఇటలీలో పారాగ్లైడింగ్ చేస్తూ ప్రమాదంలో మరణించాడు. 2012లో స్ట్రాటో ఆవరణ నుంచి ధ్వని అవరోధాన్ని బద్దలు కొట్టిన దిగ్గజ స్కైడైవర్‌గా ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ పేరుపొందాడు.
Italy Cricket Team Captain Joe Burns on T20 World Cup 2026: ఫుట్‌బాల్‌కు పేరుగాంచిన ఇటలీ.. క్రికెట్‌లో టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఐరోపా టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్‌లో సత్తాచాటిన ఇటలీ.. భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇచ్చే 2026 టీ20 ప్రపంచకప్‌లో ఆడనుంది. క్రికెట్‌లో ఐసీసీ టోర్నీకి అర్హత సాధించడం ఇటలీకి ఇదే మొదటిసారి కావడం విశేషం. టీ20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడంతో ఇటలీ క్రికెటర్లు ఆనందంలో మునిగితేలుతున్నారు.…
క్రికెట్లో చిన్న దేశమైన ఇటలీ చరిత్ర సృష్టించింది. వచ్చే ఏడాది జరగబోయే టీ20 వరల్డ్కప్ కు అర్హత సాధించింది. ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి సారి అంతర్జాతీయ వేదిక మీద టాప్ టీమ్స్ తో కలిసి పొట్టి వరల్డ్ కప్ ఆడనుంది. ఇక ఓవరాల్ గా ఈ టీ20 వరల్డ్ కప్ ఆడుతున్న 25వ జట్టుగా నిలిచింది. ప్రస్తుతం హాగ్ వేదికగా జరుగుతున్న యూరప్ క్వాలిఫైయర్స్ లో ఫైనల్ మ్యాచ్ ఇటలీ, నెదర్లాండ్స్ మధ్య జరిగింది. అయితే…
Mount Etna: ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న ప్రసిద్ధ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మళ్లీ భారీగా పేలింది. అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవడంతో, పెద్ద మొత్తంలో బూడిద మేఘాలు ఆకాశంలో ఏర్పడ్డాయి. పేలిన అగ్ని పర్వతం అగ్నిని, బూడిదను పొగలను వెదజల్లుతూ సమీప ప్రాంతాలను కమ్మేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో పర్వతం వద్ద ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. పక్కనుంచి బూడిద మేఘం విరుచుకుపడుతుండగా తమ ప్రాణాల కోసం పరుగులు తీస్తున్న వీడియోలు ప్రస్తుతం…
Donald Trump: ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ అంటే తనకు చాలా ఇష్టమని అగ్రరాజ్యం అధినేత డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. మెలోనీ గొప్ప ప్రధాని, వ్యక్తిగతంగానూ ఆవిడతో నాకు మంచి అనుబంధం ఉందని పేర్కొన్నారు.
Fraud: ఇటలీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను నిండా ముంచాడు ఓ కేటుగాడు.. సుమారు 360 మంది నిరుద్యోగులకు కుచ్చు టోపీ పెట్టి మోసగించాడు ఇచ్చాపురంకు చెందిన ఏజెంట్ కొచ్చెర్ల ధర్మా రెడ్డి. అయితే, ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసి.. సుమారు 6 కోట్ల రూపాయలతో విదేశాలకు జంప్ అయ్యాడు కేటుగాడు ధర్మారెడ్డి.
Mahakumbh Mela: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళకి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి అనేక మంది భక్తులు వస్తున్నారు. కుంభమేళ ముగిసే నాటికి ఏకంగా 45 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి వస్తారని అంచనా. ఇటీవల ఇటలీకి చెందిన ఒక ప్రతినిధి బృందం కుంభమేళలో ‘‘కాలభైరవాష్టకమ్’’ పాడటం వైరల్‌గా మారింది. హిందూ ధర్మంపై వారికి ఉన్న భక్తికి ఇది నిదర్శనంగా నిలిచింది.
Giorgia Meloni: ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ముందు మోకాళ్లపై కూర్చున్న అల్బేనియా ప్రధాని ఏడీ రామా వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. మెలోని 48వ పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు ఆయన అందమైన స్కార్ఫ్ బహూకరించారు. ఈ గిఫ్ట్ ఇచ్చేందుకు మోకాళ్లపై వంగాడు. ఈ ఘటన అబుదాబిలో జరుగుతున్న ‘‘వరల్డ్ ఫ్యూచర్ ఎనర్జీ సమ్మిట్’’లో చోటు చేసుకుంది.
ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ రియాక్ట్ అయ్యారు. మస్క్ లెఫ్ట్ వింగ్ కాకపోవడం వల్లే ఆ దేశాలన్నీ ఆయనపై మండిపడుతున్నాయన్నారు. పలు సందర్భాల్లో ఇటలీ, ఇతర దేశాధినేతలు తమ దేశ రాజకీయాల్లోనూ జోక్యం చేసుకున్నారని తెలిపింది.