Jairam Ramesh: అందుకోసమే ప్రధాని మోడీ ఇటలీ వెళ్తున్నారు.. కాంగ్రెస్ నేత విమర్శలు..
- G-7 సమ్మిట్ కోసం ఇటలీ వెళ్లనున్న ప్రధాని మోడీ..
- తన ప్రతిష్ట పెంచుకోవడానికే వెళ్తున్నారన్న కాంగ్రెస్ నేత..
- ప్రధాని మోడీపై జైరాం రమేష్ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jairam Ramesh: ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణస్వీకారం చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇటలీకి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. జూన్ 13-14 తేదీల్లో ఇటలీలోని అపులియా వేదికగా జరిగే జీ-7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు మోడీ అక్కడికి వెళ్తున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ స్వయంగా నరేంద్రమోడీకి ఆహ్వానం పంపించారు. ఈ పర్యటనపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ విమర్శించారు.
Read Also: WhatsApp: 71 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సప్..ఎందుకో తెలుసా?
Also Read
- PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. 'ఖేలో ఇండియా' విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
- Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
- September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
- Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
అంతర్జాతీయంగా నరేంద్రమోడీ ప్రతిష్ట తగ్గిందని, తన ప్రతిష్టను కాపాడుకునేందుకే ఆయన ఇటలీకి వెళ్తున్నారని జైరాం రమేష్ అన్నారు. 2007లో అప్పటి ప్రధాని, కాంగ్రెస్ నేత మన్మోహన్ సింగ్ పర్యటను పోలుస్తూ.. మన్మోహన్ సింగ్ ‘‘వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్’’గా ఉద్భవించారని, స్వీయ ప్రగల్భాల ద్వారా కాదని ప్రధాని మోడీని విమర్శించారు. అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, యూకే, జపాన్ దేశాల జీ-7 సమ్మిట్ 1970ల చివరి నుంచి జరుగుతోందని, 1997,2014 మధ్య రష్యా కూడా ఇందులో సభ్యదేశంగా ఉండేదని, 2003 నుంచి ఇండియా, చైనా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికాలను కూడా జీ -7 సమావేశాలకు ఆహ్వానించబడ్డాయని ఎక్స్ వేదికగా జైరాం రమేష్ అన్నారు.
2007లో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశంలో మన్మోహన్ సింగ్ అప్పటి జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ప్రపంచ వాతావరణ మార్పు చర్చలలో సమానత్వాన్ని నిర్ధారించడానికి ‘సింగ్-మెర్కెల్ ఫార్ములా’ను ప్రపంచానికి అందించారని రాజ్యసభ ఎంపీ జైరాం రమేష్ గుర్తు చేశారు. పీఎం మోడీని ఎగతాళి చేస్తూ, ఆయన మూడో వంతు ప్రధాని అని సంబోధించారు. చరిత్రను పీఎం మోడీ అంగీకరిస్తారని ఆశించలేమని ఆయన అన్నారు. అంతర్జాతీయ క్షీణించిన తన ప్రతిష్టను కాపాడుకునేందుకు ఈ రోజు ఇటలీకి ప్రధాని వెళ్తున్నారని విమర్శించారు. G7 సమ్మిట్‌లో భారతదేశం పాల్గొనడం ఇది 11వ మరియు G7 సమ్మిట్‌లో PM మోడీ వరుసగా ఐదవ పాల్గొనడం.
The G7 Summit of the heads of state of USA, Canada, Germany, France, Italy, UK and Japan has been taking place since the late 1970s. Between 1997 and 2014, Russia was also a member.
Since 2003, India, China, Brazil, Mexico and South Africa have also been invited to G7 Summits.… pic.twitter.com/4d2aXAOcRl
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 13, 2024
తాజావార్తలు
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Kia Carens: మారుతికి కియా భారీ షాక్.. 7-సీటర్ కేరెన్స్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సీఎన్జీ
-
Forbes India: అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ఫోర్బ్స్ కవర్‌పై ఐకాన్ స్టార్!
-
PM Modi: గ్రామీణ ప్రాంతాల ప్రతిభను వెలికితీయడమే ధ్యేయం.. ‘ఖేలో ఇండియా’ విజన్‌ను స్పష్టం చేసిన మోడీ
-
India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్‌కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్‌తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!