Home
It Raids
It Raids News
-
Soma Bharat: కవిత ఇంట్లో ఈడీ సోదాలపై న్యాయవాది ఏమన్నారో తెలుసా..?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ అధికారులు మూడు గంటలకుపైగా సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు వచ్చారని తెలుసుకున్న కవిత తరఫు న్యాయవాది సోమా భరత్ ఆమె ఇంటికి వచ్చారు. అయితే ఈడీ అధికారులు ఆయనను లోపలికి అనుమతించలేదు. ఈ క్రమంలో సోమ భరత్ కుమార్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుండి ఈడీ అధికారులు ఇలా రావడం కరెక్ట్ కాదన్నారు. సుప్రీంకోర్టులో కవిత కేసు పెండింగ్ ఉంది.. పెండింగ్ లో కేసు ఉండగా ఈడీ అధికారులు… -
Komatireddy Venkat Reddy: కవిత ఇంట్లో ఐటీ సోదాలు.. మంత్రి హాట్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిపై ఈడీ సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కవితపై ఈడీ రైడ్స్ మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారు. తాము రెండు సంవత్సరాల క్రితమే కవిత అరెస్టు అవుతుందని చెప్పామని తెలిపారు. మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడే కవిత అరెస్టు కావాలి.. కానీ అప్పుడు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. కవిత అరెస్టుతో వచ్చే సానుభూతితో మూడు నాలుగు సీట్లు సంపాదించవచ్చని… -
MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు..
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ సోదాలు చేపట్టింది. కవిత నివాసంలో నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో.. కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. -
IT Raids: హైదరాబాద్ లోని పాతబస్తీలో ఐటీ సోదాలు..
హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. -
MP Dhiraj Sahu: “నా డబ్బు కాదు, కానీ”..రూ.350 కోట్లపై తొలిసారి నోరు విప్పిన కాంగ్రెస్ ఎంపీ..
MP Dhiraj Sahu: "నా డబ్బు కాదు, కానీ"..రూ.350 కోట్లపై తొలిసారి నోరు విప్పిన కాంగ్రెస్ ఎంపీ..ఇటీవల ఆదాయ పన్ను శాఖ(ఐటీ) ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మద్యం వ్యాపారాలపై పెద్ద ఎత్తున దాడులు నిర్వహించింది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు నివాసాల్లో ఏకంగా రూ. 350 కోట్ల నగదు పట్టుబడటంతో దేశం మొత్తం ఒక్కసారిగా నివ్వెరపోయింది. గుట్టలు, గుట్టలుగా పట్టుబడిన నోట్ల కట్టల్ని లెక్కించేందుకు వందలాది మంది అధికారులు, పదుల సంఖ్యలో మిషన్లు అలసిపోయాయి. -
JP Nadda: ఐటీ రైడ్స్‌లో కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ. 300 కోట్లు.. రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి…
JP Nadda: భారతదేశంలో జరిగిన ఐటీ రైడ్స్‌లో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని విధంగా డబ్బులు బయటపడుతున్నాయి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మద్యం వ్యాపారంలో కీలకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన జార్ఖండ్ ఎంపీ ధీరజ్ సాహూ నివాసాల్లో బుధవారం నుంచి ఐటీ శాఖ దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. 290 కోట్ల నగదు బయటపడింది. ప్రస్తుతం ఇది దేశ రాజకీయాల్లో సంచలనంగా మారింది. -
Congress: “ఆ ఎంపీ బిజినెస్‌లో మాకు సంబంధం లేదు”.. ఐటీ రైడ్స్‌కి దూరంగా కాంగ్రెస్..
Congress: కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ఆయన నివాసాల్లో ఐటీ దాడులు జరిగాయి. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడిండి. ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో బుధవారం నుంచి ఐటీ అధికారులు సాహు టార్గెట్‌గా సోదాలు నిర్వహిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఏకంగా కోట్లకు కోట్ల నగదు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. మద్యం వ్యాపారంతో సంబంధం ఉన్న ధీరజ్ సాహు ఈ కేసులో ప్రధానంగా ఉన్నారు. -
BJP: రాహుల్‌గాంధీతో ధీరజ్ సాహు.. “దొంగల యాత్ర” అంటూ బీజేపీ నేత విమర్శలు..
BJP: ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐటీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బుధవారం లిక్కర్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో గుట్టలుగుట్టలుగా నగదు బయటపడుతోంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో ఐటీ దాడుల్లో ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా లెక్కలో చూపని నగదు పట్టుబడింది. -
IT Raids: కాంగ్రెస్ ఎంపీపై ఐటీ దాడులు.. ఏకంగా రూ.100 కోట్ల నగదు స్వాధీనం..
IT Raids: శుక్రవారం ఒడిశాలో కాంగ్రెస్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహుకు చెందిన పలు ప్రాంతాల్లో ఆదాయపన్ను శాఖ(ఐటీ) దాడులు నిర్వహించింది. ఎంపీకి చెందిన పలు ప్రాంతాల్లో ఏకంగా రూ. 100 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్ లో సాహుకు చెందిన నివాసాలపై ఐటీ దాడులు నిర్వహిస్తోంది. ధీరజ్ సాహు కుటుంబం పెద్ద ఎత్తున మద్యం తయారీ వ్యాపారంలో పాల్గొంటోంది. అతనికి ఒడిశాలో అనేక మద్యం… -
IT Raids: ఒడిశా వ్యాప్తంగా ఐటీ దాడులు.. రూ.200 కోట్లు స్వాధీనం..
IT Raids: ఒడిశాలోని మద్యం తయారీ కంపెనీలు, వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఒడిశా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా డబ్బులు పట్టుబడ్డాయి. బుధవారం మద్యం పరిశ్రమలో పన్నుల ఎగవేతపై ఐటీ అధికారులు విస్తృత సోదాలు చేయడం ప్రారంభించారు. గురువారం కూడా ఈ కేసులో అధికారులు దాడులు చేస్తున్నారు. పశ్చిమ ఒడిశాలోని ప్రముఖ మద్యం తయారీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన బల్డియో సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై రైడ్స్ నిర్వహించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..