MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తుంది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ సోదాలు చేపట్టింది. కవిత నివాసంలో నాలుగు టీమ్‌లుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా ఈ తనిఖీలు చేస్తున్నారు. ఏడాదిన్నరగా ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణ జరుగుతుంది. అందులో భాగంగానే.. ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. ఇప్పటికే కీలక నిందితులంతా అఫ్రూవల్ గా మారారు. కవిత ఢిల్లీ పీఏ సైతం అఫ్రూవల్ గా మారాడు. పీఏ అశోక్ కౌశిక్ అఫ్రూవల్ గా మారడంతో కేసు కీలక మలుపు తిరిగింది. అశోక్ జడ్జి ముందు సంచలన విషయాలు బయటపెట్టాడు. లిక్కర్ వ్యవహారంలో పలువురికి ముడుపులు అందించినట్లుగా అంగీకరించారు. దీంతో అశోక్ ను కవితను నిందితులుగా చేర్చి విచారించేందుకు సిద్ధమైన సీబీఐ ఫిబ్రవరి 26న విచారణకు రావాలని గత నెల నోటీసులు ఇచ్చింది. ఈ క్రమంలో.. కవిత నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Bandi Sanjay: రేవంత్ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పిన బండి సంజయ్..
Also Read
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
- Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
- Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
- Travis Head-Abhishek: కాటేరమ్మ కొడుకుల విశ్వరూపం.. ఇటు అభిషేక్, అటు ట్రావిస్ హెడ్.. బాదుడే బాదుడు..
ఇదిలా ఉంటే.. ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరైంది. హైదరాబాద్‌లోని నివాసంలోనే ఆమెను సాక్షిగా విచారించింది. అంతకుముందు లిక్కర్ స్కామ్ కేసులో విచారణకు హాజరవ్వాల్సిందిగా ఈడీ, సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చింది. అయితే తన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున విచారణకు రాలేనని సీబీఐ, ఈడీలకు కవిత లేఖలు రాశారు. గతేడాది మార్చిలో పలుమార్లు ఈడీ ముందు కవిత విచారణకు హాజరయ్యారు.
Read Also: Amitabh Bachchan: అమితాబ్ కు అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక.. ఏమైందంటే?
మరోవైపు.. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ పై విచారణను భారత అత్యున్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు) ఈనెల 19కి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తనకు ఈడీ సమన్లు ఇవ్వడాన్ని కవిత సుప్రీం కోర్టులో గతంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..