Hyderabad: హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. కాగా ఇవాళ ఉదయం నుంచి ఈ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గతంలో ఐటీ సోదాలు జరిగిన సమయంలో షానవాజ్ దుబాయ్ వెళ్లిపోయాడు.. అయితే, షానవాజ్ ను దుబాయ్ నుంచి తీసుకొచ్చిన అధికారులు ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను కట్టకుండా తప్పించుకున్నారన్న సమాచారంతోనే ఈ సోదాలను ఐటీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.