IT Raids: ఒడిశా వ్యాప్తంగా ఐటీ దాడులు.. రూ.200 కోట్లు స్వాధీనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IT Raids: ఒడిశాలోని మద్యం తయారీ కంపెనీలు, వ్యాపారులపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఒడిశా చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా డబ్బులు పట్టుబడ్డాయి. బుధవారం మద్యం పరిశ్రమలో పన్నుల ఎగవేతపై ఐటీ అధికారులు విస్తృత సోదాలు చేయడం ప్రారంభించారు. గురువారం కూడా ఈ కేసులో అధికారులు దాడులు చేస్తున్నారు. పశ్చిమ ఒడిశాలోని ప్రముఖ మద్యం తయారీ, డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అయిన బల్డియో సాహు అండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై రైడ్స్ నిర్వహించారు.
Read Also: Tejas Jet: తేజస్ క్రేజ్ మామూలుగా లేదు.. కొనేందుకు ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ ఆసక్తి
Also Read
దీంతో పాటు గురువారం మరో మద్యం తయారీదారు బౌద్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్‌కి సంబంధించిన సంబల్ పూర్ కార్యాలయంలో రూ.150 కోట్లకు పూగా నిధులను జప్తు చేశారు. రెండు రోజుల్లో ఈ మద్యం కంపెనీల నుంచి ఏకంగా రూ. 200 కోట్ల నగదును పట్టుకున్నారు. మొత్తం 30 మంది సభ్యుల ఐటీ బృందాలు సోదాలు నిర్వహించారు. ఈ కంపెనీలకు చెందిన డైరెక్టర్లు, ఎండీలను లక్ష్యంగా చేసుకుని కోల్‌కతా, రాంచీలో సోదాలు నిర్వహించేందుకు ఐటీ అధికారులు బయలుదేరారు. 2019-2021 ఆర్థిక సంవత్సరాల్లో ఈ కంపెనీలు నికర లాభాలను తగ్గించి చూపించాయని అధికారులు వెల్లడించారు. ఈ కంపెనీల బ్యాలెన్స్ షీట్స్‌లో అనుమానాస్పద ఇతర చెల్లింపులు ఉన్నాయి. ఒడిశాతో పాటు జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మరో అర డజన్ కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించినట్లు ఐటీ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!