Tech Mahindra: ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 8000 మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tech Mahindra: ప్రపంచవ్యాప్తంగా పలు ఐటీ సంస్థలు లేఆఫ్‌లు ప్రకటిస్తూనే ఉన్నాయి. ఐటీ సంస్థలు లేఆఫ్‌లను ప్రకటించడం ఒకవైపు జరుగుతుంటే.. మరోవైపు సాంకేతిక రంగంలో వచ్చిన విఫ్లవాత్మకమైన మార్పు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్(ఏఐ)తో కూడా ఐటీ ఉద్యోగులకు ఉద్యోగాలు ఊడే ప్రమాదం ఏర్పడింది. దేశంలో ఉన్న ఐటీ కంపెనీలు కూడా లేఆఫ్‌ను అమలు చేస్తున్నాయి. అయితే మహీంద్ర అండ్ మహీంద్ర సంస్థకు చెందిన టెక్ మహీంద్ర మాత్రం తన కంపెనీలో ఉద్యోగాలను తీసేయకుండా ఏకంగా 8వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. వారికి ఏఐలో నైపుణ్యాలను నేర్పించింది. టెక్ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)పై హాట్ డిబేట్ సాగుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ కంపెనీ టెక్ మహీంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల మెరుగైన భవిష్యత్‌కు ఐటీ ఉద్యోగులను సిద్ధం చేసే క్రమంలో సుమారు 8000 మందికి ఏఐలో శిక్షణ ఇచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఓపెన్ఏఐ చాట్‌జీపీటీని లాంఛ్ చేసినప్పటి నుంచి ఏఐ పట్ల ఆసక్తి పెరగడంతో పలు కంపెనీలు తమ దైనందిన కార్యకలాపాల్లో కొత్త టెక్నాలజీని వాడటం ప్రారంభించాయి.
Also Read
- Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
- Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
ఏఐ నూతన కాన్సెప్ట్ కాకపోయినప్పటికీ చాట్‌జీపీటీకి విశేష ఆదరణ లభించిన అనంతరం న్యూ టెక్నాలజీ పట్ల టెకీలతో పాటు కంపెనీల్లోనూ ఆసక్తి పెరిగింది. లేటెస్ట్‌గా టెక్ మహీంద్ర ఏఐపై తమ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా న్యూ టెక్నాలజీపై ఉద్యోగులు పట్టు సాధించేందుకు అవకాశం ఏర్పడింది. అమెరికా వంటి మార్కెట్లలో తమ కంపెనీ బీఎఫ్ఎస్ఐ, హెల్త్‌కేర్, మ్యాన్యుఫ్యాక్చరింగ్, రిటైల్ రంగాల్లో దృష్టి సారించిందని, ఉద్యోగులను భవిష్యత్ టెక్నాలజీలపై పట్టు సాధించేలా వారిపై పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయించినట్టు టెక్ మహీంద్ర మార్కెటింగ్ హెడ్, గ్లోబల్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ హర్ష్‌వేంద్ర సోయిన్ తెలిపారు. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌లో తమ సంస్థ దాదాపు 8000 మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐ, ఇతర ఏఐ ప్లాట్‌ఫాంలపై శిక్షణ ఇచ్చినట్టు ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Ramya Krishnan Birthday: ‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ ఉగ్రరూపం.. శివగామిని మించి పోయేలా..!
-
Right Age to Buy Your First Home: ఏ వయసులో ఇల్లు కొనాలి? తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..!
-
Katihar Fish Smuggling: భారీగా నిషేధిత చేపలు స్వాధీనం.. 50 క్వింటాళ్ల చైనీస్ థాయ్ మాంగూర్ పట్టివేత
-
Emmy Awards 2026: ఎమ్మీ అవార్డ్స్‌లో సరికొత్త చరిత్ర.. మాథ్యూ రైస్, జీన్ స్మార్ట్‌కు అరుదైన ఘనత!
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను పక్కనపెట్టడం ఏంటో.. బుమ్రా ఎందుకు ఆడుతున్నాడో.. బీసీసీఐకి పాక్ మాజీ స్టార్ కౌంటర్!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!