కొన్ని కంపెనీలు గత ఏడాది చవిచూసిన ఆర్థిక పరిస్థితులు కారణంగా చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారు.. 2024లో కూడా అదే పరిస్థితి నెలకొనే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటీవల వెల్లడైన టెక్ కంపెనీల ఫలితాలు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు.. ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో దాదాపు 50 వేల మంది ఉద్యోగులను నాలుగు టాప్ కంపెనీలు తొలగించే పనిలో ఉన్నాయి..
2023-24 మూడో త్రైమాసికానికి సంబంధించిన ఫలితాలలో టీసీఎస్, హెచ్‌సీఎల్ సంస్థలు స్వల్ప లాభాలను పొందగా.. విప్రో, ఇన్ఫోసిస్ కంపెనీలు మాత్రం నష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ప్రభావం ఉద్యోగుల మీద కూడా పడే అవకాశం ఉంది.ఈ ఏడాది ప్రారంభంలోనే గూగుల్, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించడం మొదలెట్టేశాయి.. అందుతున్న సమాచారం ప్రకారం.. మూడో త్రైమాసికంకు ఇండియాలోని టాప్ 4 కంపెనీలు 50,875 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది..
ఇందులో 10,669 మంది టీసీఎస్, 24182 మంది ఇన్ఫోసిస్, 18510 మంది విప్రో, 2486 మంది హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ఉద్యోగులు ఉన్నారు… ఈ ఏడాది అన్నా కలిసి వస్తుందనుకున్న ఉద్యోగులకు రెండు వారాల్లోనే చుక్కెదురైంది. ఇప్పటికి 46 ఐటీ అండ్ టెక్ కంపెనీలు సుమారు 7500 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం.. ఇక ఫిబ్రవరి నాటికి ఉద్యోగుల తొలగింపు సంఖ్య పెరగనున్నట్లు తెలుస్తుంది..