PSLV-C55: ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది.. శ్రీహరికోట నుంచి ఇవాళ ప్రయోగించిన PSLV-C55 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది.. దీంతో, శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు.. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్ కు చెందిన రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో.. టెలియోస్-2, లూమీ లైట్ -4 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.. దీంతో.. శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేత్తల సంబరాలు చేసుకున్నారు.. సహచర శాస్త్రవేత్తలు, సిబ్బందిని అభినందించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమ్‌నాథ్.. ఇక,…
PSLV-C55: మరో ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలతో పాటు.. వాణిజ్య ప్రయోగాలను కూడా చేసి విజయం సాధించింది.. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యింది.. ఈ రోజు శ్రీహరికోటలోని షార్ (SHAR) మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ 55 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలకు కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.. 741 కిలోల టెల్ ఈవోఎస్-2 ఉపగ్రహంతోపాటు,…
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది.. ఈ నెల 22న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–55 ప్రయోగం చేపట్టేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు శాస్త్రవేత్తలు… షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న పీఐఎఫ్ భవనంలో పీఎస్‌ఎల్‌వీ మొదటి, రెండు దశలు రాకెట్ అనుసంధానం ఇప్పటికే పూర్తి చేశారు శాస్త్రవేత్తలు.. సింగపూర్ దేశానికి చెందిన టెలియోస్-2, లూమి లైట్-4 ఉపగ్రహాలను…
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఆదివారం ఎల్‌వీఎం-3 వాహకనౌక ద్వారా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు.
భారత్ మూడో చంద్ర మిషన్ చంద్రయాన్-3 క్రాఫ్ట్ పూర్తిగా సిద్ధంగా ఉందని, ఈ ఏడాది మధ్యలో ప్రయోగించవచ్చని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ బుధవారం తెలిపారు.
భూమిపై పరిశీలనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా, భారత్ రోదసి పరిశోధన సంస్థ (ఇస్రో)లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘నిసార్’ ఉపగ్రహం పూర్తిస్థాయిలో సిద్ధమైంది.
ISRO: ఇస్రో మరోసారి సత్తా చాటింది. దశాబ్ధకాలంగా సేవలు అందిస్తూ, జీవిత కాలం ముగిసిపోయిన మేఘా ట్రోపిక్-1 శాటిలైన్ ను విజయవంతంగా ధ్వంసం చేసింది ఇస్రో. అత్యంత కట్టుదిట్టమైన ప్లానింగ్ లో పసిఫిక్ మహాసముద్రంలో జనావాసాలకు దూరంగా కూల్చివేసింది. అక్టోబర్ 2011లో లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ప్రవేశపెట్టబడిన మేఘా ట్రోఫిక్-1 ఉష్ణమండల వాతావరణం గురించి విలువైన సమాచారాన్ని దశాబ్ధకాలంగా అందిస్తూ వస్తోంది. భారత్, ఫ్రెంచ్ సంయుక్తంగా ఈ శాటిలైట్ ను అంతరిక్షంలోకి పంపాయి.
Megha-Tropiques-1 satellite to crash today: ఇండియన్ స్పేస్ రీసెర్చ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఈ రోజు మేఘా-ట్రోపిక్-1 ఉపగ్రహాన్ని కూల్చేవేయబోతోంది. ఈ కృత్రిమ ఉపగ్రహం జీవితకాలం తీరడంతో దీన్ని భూమిపై కూల్చేసేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఇది పసిఫిక్ మహాసముద్రంలో జనావాసాలకు దూరంగా కూల్చివేయనున్నారు. ఉపగ్రహం అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి రీఎంట్రీ అయ్యే సమయంలోనే వాతావరణ ఘర్షణ కారణంగా దాదాపుగా మండిపోతుంది. ఏదైనా శిథిలాలు మిగిలి ఉంటే అవి సముద్రంలో పడిపోతాయి.
SSLV-D2 Launch Successfully: సరికొత్త అధ్యయానికి శ్రీకారం చుట్టింది ఇస్రో.. ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలోకి ఉపగ్రహాల పంపినా ఘనత సొంతం చేసుకుంది.. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఇవాళ నింగిలోకి దూసుకెళ్లింది ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్.. ఈ ప్రయోగం ద్వారా ఇస్రో రూపొందించిన 156.3 కిలోల బరువు గల భూ పరిశీలన ఉపగ్రహం EOS-07, దేశీయ బాలికల ద్వారా స్పేస్ కిడ్జ్ ఇండియా సంస్థ రూపొందించిన 8.7కిలోల బరువు గల…