ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సిద్ధం అవుతోంది.. ఈ నెల 22న సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ–55 ప్రయోగం చేపట్టేందుకు అన్నీ సిద్ధం చేస్తున్నారు శాస్త్రవేత్తలు… షార్‌లోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా ఉన్న పీఐఎఫ్ భవనంలో పీఎస్‌ఎల్‌వీ మొదటి, రెండు దశలు రాకెట్ అనుసంధానం ఇప్పటికే పూర్తి చేశారు శాస్త్రవేత్తలు.. సింగపూర్ దేశానికి చెందిన టెలియోస్-2, లూమి లైట్-4 ఉపగ్రహాలను ఈ ప్రయోగం ద్వారా నింగిలోకి పంపనున్నారు ఇస్రో శాస్త్రవేత్తలు.. ఇది పూర్తి విదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన కమర్షియల్ ఉపగ్రహం.. సింగపూర్ దేశానికి భూ పరిశీలనకు ఉపయోగపడనున్నాయి ఈ ఉపగ్రహాలు.. ఇక, ప్రయోగానికి 25 గంటల 30 నిమిషాల ముందు కౌంట్ డౌన్ ప్రక్రియ మొదలు కానుంది..
Read Also: Covid-19: దేశంలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 12 వేలు దాటిన కేసులు