Megha-Tropiques-1 satellite to crash today: ఇండియన్ స్పేస్ రీసెర్చ ఆర్గనైజేషన్ (ఇస్రో) ఈ రోజు మేఘా-ట్రోపిక్-1 ఉపగ్రహాన్ని కూల్చేవేయబోతోంది. ఈ కృత్రిమ ఉపగ్రహం జీవితకాలం తీరడంతో దీన్ని భూమిపై కూల్చేసేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఇది పసిఫిక్ మహాసముద్రంలో జనావాసాలకు దూరంగా కూల్చివేయనున్నారు. ఉపగ్రహం అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి రీఎంట్రీ అయ్యే సమయంలోనే వాతావరణ ఘర్షణ కారణంగా దాదాపుగా మండిపోతుంది. ఏదైనా శిథిలాలు మిగిలి ఉంటే అవి సముద్రంలో పడిపోతాయి.
మేఘా ట్రోపిక్-1
మేఘా ట్రోపిక్ 1ను అక్టోబర్ 12, 2011న భారత్-ఫ్రాన్స్ అంతరిక్ష సంస్థలు సంయుక్తంలో అంతరిక్షంలోకి పంపాయి. లోయర్ ఎర్త్ ఆర్బిట్ లో ఈ ఉపగ్రహం తిరుగుతూ.. ఉష్ణమండల వాతావరణం అధ్యయానికి ఎంతో తోడ్పడింది. మొదట్లో ఈ మిషన్ మూడేళ్ల పాటు పనిచేయాలని అనుకున్నారు. అయితే ఇది ఓ దశాబ్ధం పాటు తన సేవలను అందిస్తూ కీలక డేటాను భూమి పైకి పంపింది. సంస్కృతంలో మేఘాల పేరుతో ‘మేగా’ అని, ఫ్రెంచ్ లో ఉష్ణమండలం అని అర్థం వచ్చేలా ‘ట్రోపిక్’అని ఈ రెండు కలిసి వచ్చేలా ‘మేఘా ట్రోపిక్-1’గా నామకరణం చేశారు.
ఎందుకు కూల్చివేస్తున్నారు..?
మిషన్ జీవితం ముగిసిన తర్వాత ఉపగ్రహాలను సాధారణంగా కూల్చివేస్తుంటారు. ఒకవేళ అవి అలాగే కక్ష్యలో తిరుగుతూ ఉంటే మిగతా శాటిలైట్లకు ప్రమాదం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ మేఘా ట్రోపిక్-1 ను కూల్చేస్తున్నారు. ప్రస్తుతం ఈ శాటిలైట్ లో 125 కిలోల ఇంధన ఉంది. సాధారణంగా 25 ఏళ్ల కక్ష్యా కాలానికి ఉపగ్రహాన్ని తీసుకువచ్చిన నియంత్రిత రీఎంట్రీ ద్వారా శాటిలైట్లను కూల్చేస్తారు. అయితే 867 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న మేఘా ట్రోపిక్ -1ను 20 డిగ్రీల వంపు ఆపరేషనల్ ఆర్బిట్ లో మరో 100 ఏళ్ల వరకు ఉండేది. కాగా ఇందులో 125 కిలోల ఇంధనం ఉంది. ఇది ప్రమాదవశాత్తు విడిపోతే నష్టాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే దీన్ని కూల్చేందుకు ఇస్రో సిద్ధం అయింది.
ఆగస్ట్ 2022 నుండి, కక్ష్యను క్రమంగా తగ్గించడానికి 18 కక్ష్య విన్యాసాలు నిర్వహించబడ్డాయి. మార్చి 7న సాయంత్ర 4.302 నుంచి 7.30 గంటల మధ్య భూమి గురుత్వాకర్షణ ప్రభావం ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. దీంతో భూ వాతావరణంలోకి తిరిగి వస్తూ శాటిలైట్ మండిపోతుంది. శకలాలు పసిఫిక్ మహాసముద్రంతో జనాలు లేని చోట కూలిపోతాయి. శాటిలైట్ లో ఉన్న ఇంధనంతో రెండు సార్లు డీబూస్ట్ బర్న్ లతో కక్ష్య నుంచి శాటిలైన్ ను భూమి వైపు మళ్లిస్తారు. ఫలితంగా శాటిలైట్ కూలిపోతుంది.