చంద్రయాన్-3 మిషన్‌ను జూలై 13న ప్రయోగించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రకటించింది. జూలై 13న ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు భారత అంతరిక్ష సంస్థ చీఫ్ ఎస్.సోమనాథ్ ధృవీకరించారు. ఇది జూలై 19 వరకు కొనసాగవచ్చు.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న చంద్రయాన్ 3 ప్రయోగానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి.. జులై 13న మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రయాన్-3 ప్రయోగానికి సిద్ధమైంది ఇస్రో.
PM Modi US Visit: ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనపై కీలక ఒప్పందం కుదిరింది. ఆర్టెమిస్ ఒప్పందంపై భారత్, అమెరికా సంతకాలు చేశాయని వైట్‌హౌస్ గురువారం ప్రకటించింది.
ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల వ్యవధిలోనే కీలక ఘట్టం అవిష్కృతం కాబోతుంది. అది కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగం చేపట్టనుంది. రికార్డు స్థాయి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశ పెడుతూ ప్రపంచ దేశాలను ఇస్రో ఆకట్టుకుంటుంది. చంద్రుడి పై మరిన్ని పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. అత్యాధునిక టెక్నాలజీతో జులై రెండవ వారంలో LVM-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తుంది.
ISRO, GSLV NVS-1 Navic , Indian Space Research Organisation, next-generation satellite, Navic series, space, GSLV-F12, Satish Dhawan Space Centre, Sriharikota,
Chandrayaan 3: అనుకున్నది అనుకున్నట్లు జరిగితే మరో రెండు నెలల్లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సమాయత్తం అవుతోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను ల్యాండ్ చేయడానికి అత్యంత క్లిష్టమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఈ ప్రయోగం జరగబోతోంది. చంద్రుడి రిగోలిత్ థర్మో ఫిజికల్ లక్షణాలను పరీశీలిచేందుకు, చంద్రుడిపై భూకంపాలు, చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా వాతావరణ పరిశీలించేందుకు సైన్స్ పరికరాలను చంద్రయాన్ -3 మిషన్ ద్వారా జాబిల్లి పైకి పంపనున్నారు.