PSLV-C55: ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది.. శ్రీహరికోట నుంచి ఇవాళ ప్రయోగించిన PSLV-C55 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది.. దీంతో, శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు.. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్ కు చెందిన రెండు ఉపగ్రహాలను నింగిలోకి పంపింది ఇస్రో.. టెలియోస్-2, లూమీ లైట్ -4 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.. దీంతో.. శ్రీహరికోటలోని మిషన్ కంట్రోల్ సెంటర్‌లో శాస్త్రవేత్తల సంబరాలు చేసుకున్నారు.. సహచర శాస్త్రవేత్తలు, సిబ్బందిని అభినందించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమ్‌నాథ్.. ఇక, ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఇస్రో మాజీ ఛైర్మన్లు. డా.రాధా కృష్ణన్.. డా.ఏ.ఎస్.కిరణ్ కుమార్ హాజరయ్యారు.
Read Also: Samyuktha Menon: ‘సంయుక్త’ అన్నీపెంచేసిందా?
ఈ ప్రయోగం కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శుక్రవారం ఉదయం 11.49 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించింది.. మొత్తం 25.30 గంటల పాటు కౌంట్‌డౌన్ ప్రక్రియ కొనసాగిన తర్వాత మధ్యాహ్నం 2.19 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది పీఎస్‌ఎల్వీ-సీ 55 రాకెట్. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలకు కక్ష్యలో ప్రవేశపెట్టింది. 741 కిలోల టెల్ ఈవోఎస్-2 ఉపగ్రహంతో పాటు, 16 కిలోల బరువున్న లుమొలైట్ అనే చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది ఇస్రో.