PSLV-C55: మరో ప్రయోగానికి సిద్ధమైంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO).. ఇప్పటికే ఎన్నో ప్రతిష్టాత్మక ప్రయోగాలతో పాటు.. వాణిజ్య ప్రయోగాలను కూడా చేసి విజయం సాధించింది.. ఇప్పుడు మరో ప్రయోగానికి రెడీ అయ్యింది.. ఈ రోజు శ్రీహరికోటలోని షార్ (SHAR) మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 2.19 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ 55 రాకెట్‌ను ప్రయోగించనుంది. ఈ ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన రెండు ఉపగ్రహాలకు కక్ష్యలో ప్రవేశపెట్టనుంది.. 741 కిలోల టెల్ ఈవోఎస్-2 ఉపగ్రహంతోపాటు, 16 కిలోల బరువున్న లుమొలైట్ అనే చిన్న ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది ఇస్త్రో.
Read Also: IPL 2023: పేరుకే ఆల్ రౌండర్.. అసలు టీమ్ లో ఎందుకున్నాడో అర్థం కావడం లేదు..
ఇక, ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియ శుక్రవారం ఉదయం 11.49 గంటలకు ప్రారంభం అయ్యింది.. విజయవంతంగా కౌంట్‌డౌన్ ప్రక్రియ సవ్యంగా కొనసాగుతోంది.. మొత్తం 25.30 గంటల కౌంట్‌డౌన్ ప్రక్రియ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2.19 గంటలకు నింగిలోకి దూసుకెళ్లనుంది పీఎస్‌ఎల్వీ-సీ 55 రాకెట్. మరోవైపు ప్రయోగ ప్రక్రియపై శాస్త్రవేత్తలతో ఇస్రో చైర్మన్ డా.సోమ్ నాథ్ సమావేశం నిర్వహించారు.. శుక్రవారం రోజు తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన విషయం విదితమే.