Turkey: టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి పాలస్తీనా, హమాస్ పక్షానికి మద్దతుగా నిలిచారు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనా భూభాగంపై దాడులను తీవ్రతరం చేసిన తర్వాత.. ఈ దాడులకు స్వస్తి చెప్పాలని ఎర్డోగాన్ శనివారం ఇజ్రాయిల్ ని కోరారు. ఇజ్రాయిల్ ‘‘తక్షణమే ఈ పిచ్చిని ఆపేయాలి’’ అని పిలుపునిచ్చాడు. గత రాత్రి గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు తీవ్రమయ్యాయి. మరోసారి మహిళలు, పిల్లలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయి, కొనసాగుతన్న మానవత సంక్షోభాన్ని మరింత దిగజార్చాయి అని…
Priyanka Gandhi: ఇజ్రాయిల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి పిలుపునిస్తూ శనివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ)లో పలు దేశాలు కలిసి తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. గాజా స్ట్రిప్కి సాయం అందించడానికి, పౌరులకు రక్షణ కల్పించాలని తీర్మానంలో పేర్కొన్నారు. అయితే ఈ తీర్మానంపై ఓటింగ్ కి భారతదేశం దూరంగా ఉంది. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై నేను సిగ్గుపడుతున్నా అని అన్నారు.
Blockade of the Gaza: అక్టోబర్ 7 వతేదీన మోగీన యుద్ధ బేరి నేటికీ వినపడుతూనే ఉంది. ఇజ్రాయిల్ పై హమాస్ చేసిన ఆకస్మిక దాడిలో 1450 మందికి పైగా చనిపోయారు. కాగా హమాస్ విచక్షణారహిత దాడులకు బదులు తీర్చుకుంటాం.. హమాస్ ను నాశనం చేస్తామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. అన్నట్లుగానే హమాస్ పైన ప్రతీకార దాడులను జరుపుతుంది. ఇప్పటికే గాజా పైన ఇజ్రాయిల్ చేసిన ప్రతీకార దాడిలో 7,326 మంది మరణించినట్లుగా హమాస్ ఆరోగ్య శాఖా…
USA: ఇరాన్ లోని హమాస్ అధికారి, ఇరాన్ లోని రివల్యూషనరీ గార్డ్ సభ్యులతో సహా ఇటీవల ఇజ్రాయిల్ పై దాడికి తెగబడిన పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్‌పై అమెరికా రెండో రౌండ్ ఆంక్షలు విధించింది.
Qatar: ఖతార్‌లోని అక్కడి కోర్టు 8 మంది మాజీ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. ఈ ఘటనపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. బాధితులకు కావాల్సిన న్యాయసాయం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. కోర్టు తీర్పు గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని, వారి కుటుంబ సభ్యులతో టచ్ లో ఉన్నామని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
Israel-Palestine: ఇజ్రాయిల్-హమాస్ మధ్య అక్టోబర్ 7న మొదలైన యుద్ధం భీకరంగా సాగుతోంది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై దాడి చేసి 1400 మందిని చంపారు, 200 మంది కన్నా ఎక్కువ మందిని బందీలుగా చేసుకుని గాజాలోకి తీసుకెళ్లారు. అయితే బందీలను సురక్షితంగా విడిపించేందుకు ఇజ్రాయిల్ రెస్క్యూ ఆపరేషన్, భూతల దాడులకు సిద్ధమవుతోంది.
Israel-Hamas War: అక్టోబర్ 7 హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై క్రూరమైన దాడిని చేశారు. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించారు. 200 మందికి పైగా సాధారణ ప్రజలను బందీలుగా పట్టుకుని గాజాకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో అప్పటి నుంచి ఇజ్రాయిల్, గాజాపై వైమానిక దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 6500 మంది మరణించారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు వైమానిక దాడులకు పరిమితమైన ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) ఇప్పుడు భూతల దాడులకు సిద్ధమవుతున్నాయి. గాజా…
Israel Hamas War: గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను తీవ్రతరం చేయడం వల్ల పౌరుల మరణాల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడిలో అల్ జజీరా రిపోర్టర్ వేల్ అల్-దహదౌహ్ కుటుంబం మొత్తం చనిపోయారు.
Tayyip Erdogan: వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటే టర్కీ అధ్యక్షుడు తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. అక్టోబర్ 7న పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయిల్ లోకి చొరబడి అక్కడి ప్రజల్ని ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది అమయాకు ప్రజలు, పిల్లలు, మహిళలు చనిపోయారు. ఈ దాడి ప్రస్తుతం ఇజ్రాయిల్, హమాస్ మధ్య తీవ్ర యుద్ధానికి కారణంమైమది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతోంది.
Israel: అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై పాలస్తీనా హమాన్ మిలిటెంట్ సంస్థ క్రూరమైన దాడికి పాల్పడింది. ఈ దాడిలో 1400 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. అయితే అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ వైమానిక బలగాలు నిప్పుల వర్షాన్ని కురపిస్తున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఉన్నారని అనుమానం వచ్చినా కూడా ఆ భవనాలను నామరూపాలు లేకుండా చేస్తోంది. ఇజ్రాయిల్ జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు గాజాలో 5000 మంది చనిపోయారు. వీరిలో సాధారణ పౌరులు, పిల్లలు కూడా…