Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం గాజాను అంధకారంలో పడేసింది. హమాస్ మిలిటెంట్లపై ఇజ్రాయిల్ దాడులు అక్కడి సాధారణ ప్రజానీకాన్ని కష్టాలపాలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ వరసగా దాడులను తీవ్రతరం చేయడంతో గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిలో సేవలు స్తంభించాయి. గాజాలోని అతిపెద్ద ఆస్పత్రైన అల్ షిఫా మెడికల్ కాంప్లెక్స్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిందని హమాస్ ఆధ్వర్యంలోని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇంధనం లేక చివరి జనరేటర్ కూడా నిలిచిపోయిందని ఓ పసికందు సహా ఐదుగురు రోగులు ప్రాణాలు…
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య భారత్- అమెరికాల 5వ ‘టూ ప్లస్ టూ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో ఇరు దేశాలు ఇజ్రాయెల్‌కు బహిరంగంగా మద్దతు తెలిపాయి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం మధ్య గాజా స్ట్రిప్‌లోని ఓ ఆసుపత్రిపై దాడి జరిగింది. ఈ దాడిలో 22 మంది మరణించినట్లు సమాచారం. ఈ దాడికి ఇజ్రాయెల్ కారణమని పాలస్తీనా ఆరోపించింది.
IIT Bombay: ఐఐటీ - బాంబే మరోసారి వార్తల్లో నిలిచింది. గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చిన ఓ ప్రొఫెసర్ పాలస్తీనా ఉగ్రవాదులను కీర్తించడం వివాదాస్పదం అయింది. ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సదరు ప్రొఫెసర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 6న జరిగిన దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Israel-Hamas War: హమాస్ మిలిటెంట్ సంస్థను పూర్తిగా నాశనం చేసేదాకా ఇజ్రాయిల్ నిద్రపోయే పరిస్థితి కనిపించడం లేదు. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటోంది హమాస్. ఆ దాడిలో 1400 మంది ఇజ్రాయిలీ పౌరులను ఊచకోత కోసింది. 200 మందిని బందీలుగా పట్టుకుంది. అప్పటి నుంచి గాజా స్ట్రిప్ పై ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) నిప్పుల వర్షం కురిపిస్తోంది. భూతల దాడులతో విరుచుకుపడుతోంది.
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి అక్కడి ప్రజల్ని క్రూరంగా ఊచకోత కోశారు. ఈ దాడిలో 1400 మంది చనిపోయారు. 200 మందిని బందీలుగా హమాస్ మిలిటెంట్లు గాజాలోకి పట్టుకెళ్లారు. హమాస్ చేసిన పని ప్రస్తుతం గాజాలోని పాలస్తీనియన్ల పాలిట నరకంగా మారింది. ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ పై జరిపిన దాడిలో 10,500 మందికి పైగా మరణించారు.
Qatar: గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలపై ఖతార్ ప్రభుత్వం 8 మంది మాజీ ఇండియన్ నేవీ అధికారులకు మరణశిక్ష విధించింది. గతేడాది ఆగస్టులో వీరిని అరెస్ట్ చేసిన అక్కడి అధికారులు, ఇటీవల మరణశిక్ష విధించారు. దీనిపై భారత్ షాక్‌కి గురైంది. దీనిపై న్యాయపరంగా, దౌత్యపరంగా పోరాటానికి భారత్ సిద్ధమైంది.
Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ వార్ భీకరంగా సాగుతోంది. ఇప్పటికే ఇజ్రాయిల్ సైన్యం గాజాను చుట్టుముట్టింది. భూతల దాడులు చేస్తోంది. ఉత్తరగాజాను తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఇజ్రాయిల్ సైన్యం సిద్ధమైంది. దీంతో పాటు హమాస్ టన్నెల్ నెట్‌వర్క్‌తో పాటు హమాస్‌ని పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడులను ముమ్మరం చేసింది. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ భూభాగంలోకి చొరబడి 1400 మందిని దారుణంగా చంపేశారు. 200 మందిని బందీలుగా పట్టుకున్నారు.
Israel: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న వేళ జెరూసలెంలో విద్వేష ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల యువకుడు 20 ఏళ్ల మహిళా పోలీస్ అధికారిని కత్తితో పొడిచి చంపారడు. జెరూసలేంలో పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఇజ్రాయిల్-అమెరికన్ సార్జెంట్ ఎలిషేవా రోజ్ ఇడా లుబిన్పై దాడి జరిగింది. ఘటనా సమయంలో లుబిన్ మరో ఇద్దరు అధికారులతో కలిసి జెరూసలేంలోని ఓల్డ్ సిటీలో పెట్రోలింగ్ చేస్తోంది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన లుబిన్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.