Israel-Hamas War: ఇజ్రాయిల్ పాలస్తీనా యుద్ధం ప్రారంభమై ఇప్పటికే నెల పది రోజులు కావొస్తుంది. అయినా నేటికీ యుద్ధ కీలలు ఎగసి పడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఇరు దేశాల పోరులో వేలాది మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. కాగా తాజాగా హమాస్ కి చెందిన సీనియర్ నేత కూడా మరణించారని హమాస్ పేర్కొంది.. వివరాలలోకి వెళ్తే.. శనివారం ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్ లో దాడులు జరిపింది. ఈ దాడుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు అహ్మద్ బహర్ మరణించినట్లు పాలస్తీనా ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్ (హమాస్) ధృవీకరించింది. ఈ నేపథ్యంలో హమాస్ అధికారులు మాట్లాడుతూ.. శనివారం ఇజ్రాయిల్ చేసిన వైమానిక దాడుల్లో అహ్మద్ బహర్ గాయపడ్డారని.. ఆ తరువాత ఆ గాయాల కారణంగా మరణించాడని పేర్కొన్నారు.
Read also:Telangana Elections 2023: బాబు మోహన్‌కి షాక్ ఇచ్చిన తనయుడు!
కాగా ఇతను 2006లో పాలస్తీనా పార్లమెంటరీ ఎన్నికల్లో హమాస్ గెలిచినప్పటి నుంచి పాలస్తీనా లెజిస్లేటివ్ కౌన్సిల్ తాత్కాలిక స్పీకర్‌గా పనిచేశారు. అలానే గతంలో బహార్ షురా కౌన్సిల్ అధిపతితో సహా అనేక ఇతర సీనియర్ హమాస్ పదవులను కూడా నిర్వహించారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడి చేసి చిన్న పెద్ద తేడా లేకుండా కనిపించిన వారిని కనిపించినట్లు విచక్షణారహితంగా చంపేసింది. ఈ నేపథ్యంలో హమాస్ ను నామరూపాలు లేకుండా చేస్తామంటూ ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ చేసింది. అన్నట్టుగానే నాటి నుండి నేటి వరకు హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా దాడులు జరుపుతుంది. కాగా హమాస్ మాత్రం ప్రజలను అడ్డం పెట్టుకుని యుద్ధం చెయ్యాలి చూస్తూ అమాయక ప్రజల మరణాలకు కారణం అవుతుంది అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.