Elon Musk: ఎలాన్ మస్క్ గాజాను సందర్శించాలి.. ఆహ్వానించిన హమాస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Elon Musk: టెస్లా అధినేత, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కి అరుదైన ఆహ్వానం అందింది. హమాస్ ఉగ్రసంస్థ మస్క్‌ని గాజా సందర్శించాల్సిందిగా ఆహ్వానించింది. ఇజ్రాయిల్ పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్, ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో పాటు ఇజ్రాయిల్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. ఈ పర్యటన తర్వాత గాజాను సందర్శించాలని హమాస్ సీనియర్ అధికారి మంగళవారం మస్క్‌కి ఆహ్వానం పలికారు.
ఇజ్రాయిల్, గాజాపై జరిగిప విధ్వంసాన్ని చూడాలని, అందుకోసం గాజా స్ట్రిప్‌లో పర్యటించాలని హమాస్ కోరింది. గాజాలో మారణకాండ, విధ్వంసాన్ని చూడాలని మస్క్‌ని ఆహ్వానించినట్లు హమాస్ సీనియర్ అధికార ఒసామా హమ్దాన్, లెబనాన్ బీరూట్‌లో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు. సోమవారం మస్క్ ఇజ్రాయిల్‌లో పర్యటించి, హమాస్ దాడి చేసిన ప్రాంతాలను సందర్శించారు. హమాస్‌ని హతమార్చడం తప్పితే వేరే మార్గం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్‌కి మద్దతు ప్రకటించారు.
Also Read
- Rubik’s Cube World Record: 6 ఏళ్ల చిన్నారి అద్భుతం.. 4.27 సెకన్లలో రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసి ప్రపంచ రికార్డు
- Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
- Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
అక్టోబర్ 7 నాటి హమాస్ దాడుల ఫలితంగా ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం జరిగుతోంది. ప్రస్తుతం ఇరు పక్షాలు కూడా కాల్పుల విరమణ, సంధి ఒప్పందాన్ని అంగీకరించాయి. హమాస్ ఉగ్రవాదులు బంధించిన ఇజ్రాయిలీలను, ఇతర దేశాల వారిని వదిలిపెడుతున్నారు, దీనికి ప్రతిగా ఇజ్రాయిల్ జైళ్లలో ఉన్న పాలస్తీనియన్లును వదిలేస్తున్నారు. నాలుగు రోజుల సంధిని మరో రెండు రోజులకు పొడగించారు.
హమాస్ లీడర్ హమ్దాన్ మాట్లాడుతూ.. 50 రోజుల్లో ఇజ్రాయిల్ 40,000 టన్నులకు పైగా పేలుడు పదార్థాలను పడేసిందని ఆరోపించారు. ఇజ్రాయిల్‌లో అమెరికా తన సంబంధాలను సమీక్షించాలని, వారికి ఆయుధాలు సరఫరా చేయవద్దని, అమెరికా ప్రెసిడెంట్‌ని కోరారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో ఇజ్రాయిల్‌లో 1200 మంది మరణించాగా.. హమాస్ 240 మందిని బందీలుగా పట్టుకుంది. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 16000 మంది పాలస్తీనియన్లు మరణించారు.
తాజావార్తలు
-
KTR: కరెంట్ కోతలపై కేటీఆర్ ఫైర్.. ‘ఇది ఎల్ నినో కాదు.. ఎల్ కాంగ్రెస్’.!
-
YS Jagan: అవినీతి ఏ స్థాయికి వెళ్లిందో చెప్పడానికి డీఎస్సీనే ఉదాహరణ!
-
SIR Row: ఈసీలో అంతర్గత విభేదాలు.. ‘‘దేశ ద్రోహం’’ అంటూ రాహుల్ విమర్శలు..
-
Banks Open on Sunday: బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!