Israel-Hamas: హమాస్ దాడి తర్వాత ఆ సంస్థను పూర్తిగా అంతం చేసేందుకు ఇజ్రాయిల్ పీఎం బెంజమిన్ నెతన్యాహు పావులు కదుపుతున్నారు. మాజీ ప్రధాని గోల్డా మీర్ అడుగుజాడల్లో నడవాలని అనుకుంటున్నారు. ఇజ్రాయిల్ తన శత్రువులను చంపేందుకు ‘ఆపరేషన్ వ్రాత్ ఆఫ్ గాడ్’ లాంటి మిషన్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే హమాస్ కీలక నేతల్ని చంపేందుకు నెతన్యాహు ఇజ్రాయిలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మొసాద్’ని ఆదేశించారు. ప్రస్తుతం హమాస్ కీలక నాయకత్వం టర్కీ, లెబనాన్, ఖతార్ దేశాల్లో తలదాచుకుంటున్నారు.
అయితే ఈ వాదనలపై మొసాద్ మాజీ డైరెక్టర్ ఆందోళనలు లేవనెత్తారు. వాల్ స్ట్రీట్ జర్నన్ చర్యలు ఇటువంటి అనాలోచిత చర్యలు అనాలోచిత పరిణామాలను కలిగిస్తాయని, ఈ ప్రాంతాన్ని అస్థిరపరుస్తాయని హెచ్చరించారు. ప్రపంచవ్యాప్తంగా హమాస్ టార్గెట్స్‌ని నిర్మూలించడం వల్ల ఇజ్రాయిల్‌కి ముప్పులు తప్పవని హెలేవీ చెప్పారు. హమాస్ నాయకులను నిర్మూలించాలనే పద్దతి ప్రతీకారం తీర్చుకోవానే కోరికని, ఇది వ్యూహాత్మక లక్ష్యాలను సాధించాలనే కోరిక కాని యఆయన అన్నారు.
హమాస్ కీలక నేతలుగా ఉన్న ఇస్మాయిల్ హనియేష్, మహ్మద్ దీఫ్, యహ్యా సిన్వార్, ఖలీద్ మషాల్ వంటి ప్రముఖులు మొసాద్ టార్గెట్లుగా ఉన్నారు.
ఇస్మాయిల్ హనియే:
ఇస్మాయిల్ హనియే(60) పాలస్తీనా మాజీ ప్రధాని. 2017లో హమాస్ పొలిటికల్ బ్యూరో అధిపతిగా ఎన్నికయ్యారు. 2006లో పాలస్తీనా ప్రధానిగా పనిచేస్తున్నప్పుడు విష ప్రయోగం ద్వారా హత్య చేయాలని కుట్ర పన్నారు. ఖతార్, టర్కీల్లో ప్రవాసంలో ఉన్నాడు.
మహ్మద్ దీఫ్:
హమాస్ సైనిక విఘానికి, ఎజ్డైన్ అల్ కస్సామ్ బ్రిగేడ్స్‌కి నాయకత్వం వహిస్తు్న్నాడు. ఇజ్రాయిల్ శత్రువుల్లో నెంబర్ 1గా ఉన్నాడు. ఇజ్రాయిల్ అధికారులు ఇతన్ని ఆరుసార్లు హత్య చేయడానికి ప్రయత్నించారు. 2015లో యూఎస్ ఇతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి ప్రారంభంలో ‘‘ అల్ అక్సా ఫ్లడ్’’ పేరిట ఆడియో సందేశం ఇచ్చిన వ్యక్తి డీఫ్ అని తెలుస్తోంది. అయితే అతను ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే ఆచూకీ లేదు. గాజా స్ట్రిప్ ప్రాంతంలో ఉన్నాడని ఇజ్రాయిల్ భావిస్తోంది.
యాహ్య సిన్వార్:
61 ఏళ్ల యాహ్యా సిన్వార్, ఎజ్డైన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్‌కు మాజీ కమాండర్. గాజాలోని హమాస్ అధిపతిగా 2017లో ఎన్నికయ్యారు. అతను 2011లో విడుదలకు ముందు ఇజ్రాయెల్ జైళ్లలో 23 సంవత్సరాలు గడిపాడు. ఇజ్రాయిల్ సైనికుడు గిలాన్ షాలిత్‌ని హమాస్ బంధించిన సమయంలో ఖైదీల మార్పిడి సంధిలో ఇతన్ని ఇజ్రాయిల్ విడుదల చేసింది.
ఖలీద్ మషాల్:
మషాల్ హమాస్ పోలిట్ బ్యూరో వ్యవస్థాపక సభ్యుడు. 2017 వరకు చైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుతం అతను ఖతార్‌లో ఉన్నట్లు భావిస్తున్నారు. 1997లో జోర్డాన్ లో కెనడియన్ టూరిస్ట్‌గా నటిస్తూ మొస్సాద్ ఏజెంట్లు మషాల్ చెవుల్లో ప్రాణాంతక విషాన్ని స్ప్రే చేశారు. అప్పటి యూఎస్ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జోక్యం చేసుకోవడంతో విరుగుడుతో మొసాద్ చీఫ్ డానీ యాటోవ్ జోర్డాన్ వెళ్లాల్సి వచ్చింది.