పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. అత్యవసర సమావేశానికి రావాలని అరబ్ దేశాలను రష్యా ఆహ్వానించింది. ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల దాడి చేయడాన్ని అగ్ర రాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను హెచ్చరించింది.
ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. తగిన గుణపాఠం చెబుతామని ఇజ్రాయెల్ చెబుతూనే వచ్చింది.
ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. అయితే కొన్నింటిని గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయి. అయితే మంగళవారం దాడి సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు భయంతో బంకర్లోకి పరిగెడుతున్నారంటూ ఇరాన్ అనుకూల సోషల్ మీడియాలో వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.
ఇరాన్ ఇజ్రాయెల్‌పై అనేక క్షిపణులను ప్రయోగించింది. దీని కారణంగా ఇజ్రాయెల్ పౌరులు సురక్షితమైన ప్రదేశాలలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. ఈ దాడి తర్వాత ఇరాన్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్థరాత్రి వరకు ఈ దాడి కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం గురించి తక్షణ సమాచారం అందలేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ కీలక ప్రకటన చేశారు.
ఇజ్రాయెల్ దూకుడును లెక్కచేయకుండా చాలా కాలంగా సంయమనం పాటిస్తున్న ఇరాన్ మంగళవారం రాత్రి వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉంది. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించింది. ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే ఇజ్రాయెల్ తదుపరి లక్ష్యమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సంఘర్షణను మరింత తీవ్రతరం చేయడమే కాకుండా ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా, ప్రపంచం మొత్తం మూడవ ప్రపంచ యుద్ధం ముప్పును ఎదుర్కొంటోందని అనడంలో తప్పేం లేదు. అదే ఇరాన్, ఇజ్రాయెల్ ఒకప్పుడు స్నేహితులు కూడా? రెండు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్న నేపథ్యంలో, ఈ దేశాల చరిత్రను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 200 బాలిస్టిక్ క్షిపణులను ఇరాన్ ఇజ్రాయెల్‌పై ప్రయోగించింది. ఇరాన్ దాడుల తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది. ఇరాన్ దాడుల్లో ఒకరు మరణించినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. దాడుల తర్వాత ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ బెదిరించింది
పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధం అంచున నిలిచింది. హెజ్బొల్లా, హమాస్ అగ్రనేతలను అంతమొందించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. నివేదికల ప్రకారం, ఇరాన్ ఇజ్రాయెల్‌పై 200 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించింది. ఇరాన్ దాడిపై అమెరికా అంతకుముందే అలర్ట్ చేసింది. ఈ హెచ్చరికను దృష్టిలో ఉంచుకుని, ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులకు భారతదేశం ఒక అడ్వైజరీ జారీ చేసింది.
లెబనాన్‌లోని హిజ్బుల్లాపై సైనిక చర్యను ప్రారంభించిన ఇజ్రాయెల్‌పై ఇరాన్ మంగళవారం క్షిపణులను ప్రయోగించింది. హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియా మృతికి ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని, ఎలాంటి ప్రతీకార చర్యలనైనా ఎదుర్కొనేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని ఇరాన్ ప్రకటించింది.
Iran Israel War: ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడి తర్వాత, ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ సోషల్ మీడియాలో అనేక పోస్ట్‌లు చేశారు. ఖమేనీ బుధవారం తన సోషల్ మీడియా ‘X’ ఖాతా ద్వారా ఒక చిత్రాన్ని పంచుకున్నారు. దీనిలో చాలా క్షిపణులు ఉంది అందులో కొన్ని క్షిపణులు ప్రయోగించబడుతున్నాయి. ఏ ఫోటోను షేర్ చేస్తూ.. ‘చింతించకండి, దేవుని సహాయం త్వరలో వస్తుంది. విజయం దగ్గర పడింది అని రాసుకొచ్చారు. ఈ పోస్ట్ తర్వాత ‘దేవుని సహాయంతో,…