మంగళవారం అర్థరాత్రి ఇరాన్ ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ సైనిక స్థావరాలు, మొసాద్ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించారు. చాలా క్షిపణులను కూల్చివేయడంలో ఇజ్రాయెల్ వైమానిక రక్షణ విజయం సాధించింది. ఇందులో జోర్డాన్‌తో పాటు అమెరికా నుంచి ఇజ్రాయెల్ సాయం పొందినట్లు తెలిసింది.
లెబనాన్‌లో ఉన్న హిజ్బుల్లాను పూర్తిగా నిర్మూలించేందుకు ఇజ్రాయెల్ నిరంతరం దాడి చేస్తోంది. మొదట సంస్థ అధిపతి సయ్యద్ హసన్ నస్రల్లా, అతని కుమార్తె, అనేక మంది టాప్ కమాండర్లు చంపబడ్డారు. అదే సమయంలో, సిరియా రాజధాని డమాస్కస్‌లోని ఒక ఫ్లాట్‌పై జరిగిన దాడిలో నస్రల్లా అల్లుడు హసన్ జాఫర్ అల్ ఖాసిర్ మరణించాడు. హిజ్బుల్లాకు చెందిన మీడియా కూడా దీనిని ధ్రువీకరించింది
ఇరాన్ క్షిపణి దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందనే భయం పెరుగుతోంది. కాగా, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతపై అభివృద్ధి చెందిన దేశాల సమూహం జీ-7 అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. ప్రస్తుత ఛైర్పర్సన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఈ సమావేశానికి పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్‌కు బుధవారం భారీ ఎదురుదెబ్బ తగిలింది. లెబనాన్ ప్రతిదాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన 8 మంది సైనికులు మృతిచెందినట్లు ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. గతేడాది అక్టోబర్ నుంచి యుద్ధం చేస్తున్నా.. ఇప్పటి వరకు సైన్యానికి ఎలాంటి హానీ జరగలేదు.
గతేడాది అక్టోబర్ నుంచి హమాస్‌తో మొదలైన ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పటిదాకా ఏకధాటిగా కొనసాగించింది. గాజాను నేలమట్టం చేసింది. ఇప్పుడు హిజ్బుల్లా లక్ష్యంగా లెబనాన్‌లో దాడులు చేస్తోంది. ఇన్ని రోజులు పోరాటంలో ఇజ్రాయెల్ చాలా జాగ్రత్తగా యుద్దం చేస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రష్యా కీలక సమావేశానికి పిలుపునిచ్చింది. అత్యవసర సమావేశానికి రావాలని అరబ్ దేశాలను రష్యా ఆహ్వానించింది. ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల దాడి చేయడాన్ని అగ్ర రాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ను హెచ్చరించింది.
ఇరాన్‌పై ప్రతీకార దాడులకు ఇజ్రాయెల్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మూల్యం చెల్లించుకోక తప్పదని ఇరాన్‌కు తీవ్ర వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్ కవ్వింపు చర్యలకు దిగితే.. తగిన గుణపాఠం చెబుతామని ఇజ్రాయెల్ చెబుతూనే వచ్చింది.
ఇజ్రాయెల్‌పై మంగళవారం ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. దాదాపు 180 క్షిపణులను ప్రయోగించినట్లుగా తెలుస్తోంది. అయితే కొన్నింటిని గగనతలంలోనే ఇజ్రాయెల్ పేల్చేసింది. మరికొన్ని ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను ధ్వంసం చేశాయి. అయితే మంగళవారం దాడి సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమన్ నెతన్యాహు భయంతో బంకర్లోకి పరిగెడుతున్నారంటూ ఇరాన్ అనుకూల సోషల్ మీడియాలో వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చక్కర్లు కొడుతోంది.
ఇరాన్ ఇజ్రాయెల్‌పై అనేక క్షిపణులను ప్రయోగించింది. దీని కారణంగా ఇజ్రాయెల్ పౌరులు సురక్షితమైన ప్రదేశాలలో ఆశ్రయం పొందవలసి వచ్చింది. ఈ దాడి తర్వాత ఇరాన్లో వేడుకలు ప్రారంభమయ్యాయి. మంగళవారం అర్థరాత్రి వరకు ఈ దాడి కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం గురించి తక్షణ సమాచారం అందలేదు. ఈ క్రమంలో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ కీలక ప్రకటన చేశారు.
ఇజ్రాయెల్ దూకుడును లెక్కచేయకుండా చాలా కాలంగా సంయమనం పాటిస్తున్న ఇరాన్ మంగళవారం రాత్రి వరుస క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ క్షిపణి దాడుల తర్వాత ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉంది. ఇరాన్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని బెదిరించింది. ఇప్పుడు ఇరాన్ అణ్వాయుధ కేంద్రాలే ఇజ్రాయెల్ తదుపరి లక్ష్యమని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది సంఘర్షణను మరింత తీవ్రతరం చేయడమే కాకుండా ప్రపంచాన్ని మూడవ ప్రపంచ యుద్ధం వైపు తీసుకెళుతుందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.