Muslim Countries Alliance: ఇజ్రాయెల్‌కు చెక్ పెట్టడానికి సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్ కొత్త కూటమి ఏర్పాటు చేయనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ మూడు ముస్లిం దేశాలు కొత్త కూటమి ఏర్పాటు చేయవచ్చని అన్నారు. ఇరాన్ ఇప్పటికే దీని కోసం ప్రయత్నాలను ప్రారంభించిందని వెల్లడించారు. ఈ మూడు దేశాలు కలిసి వస్తే, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఆధిపత్యం బలహీనపడుతుందని స్పష్టం చేశారు. READ ALSO: Suzuki Vision e-Sky: సుజుకి తన తొలి…
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. ప్రతిదాడులు చేస్తామంటూ ఐడీఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్- ఇరాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Israel Iran War: ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య ఘర్షణ తీవ్రమవుతోంది. ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు మిస్సైళ్లతో దాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమాలపై ఇజ్రాయిల్ దాడులు చేయడంతో పాటు ఆ దేశానికి చెందిన టాప్ మిలిటరీ జనరల్స్‌ని ఎలిమినేట్ చేసింది.
Viral Video: హౌతీ ఉగ్రవాదులు ఆదివారం రోజు ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ మిస్సై్ల్‌తో దాడి చేశారు. ఇజ్రాయిల్‌లో అతిపెద్ద విమానాశ్రయమైన టెల్ అవీవ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపైకి మిస్సైల్‌ని ప్రయోగించారు. దీంతో ఒక్కసారిగా ఇజ్రాయిల్ ప్రజల్లో భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 3 నుంచి కేవలం 75 మీటర్ల దూరంలోనే క్షిపణి పడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Israel Hezbollah War: హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. తాజాగా జరిగిన దాడుల్లో హిజ్బుల్లా బంకర్ నుంచి ఏకంగా 500 మిలియన్ డాలర్ల డబ్బు, బంగారాన్ని కనుగొన్నట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) వెల్లడించింది. హిజ్బుల్లాకు నిధులు, దాని కార్యకలాపాల కోసమే ఈ డబ్బును వినియోగిస్తున్నట్లు తెలిపింది.
Israel Hamas War: నెల రోజులకు పైగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇది రోజురోజుకు ముదురుతోంది. ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని మూడు ఆసుపత్రులను చుట్టుముట్టిందని తీవ్రవాద సంస్థ హమాస్ నిర్వహిస్తున్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.