ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ట్రంప్ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. అనంతరం ఇజ్రాయెల్, ఇరాన్ కూడా ధృవీకరించాయి. అయితే తాజాగా ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ ఇజ్రాయెల్ మండిపడింది. ప్రతిదాడులు చేస్తామంటూ ఐడీఎఫ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇజ్రాయెల్- ఇరాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ అనంతరం పరస్పరం దాడులు చేసుకోవడంపై ఫైర్ అయ్యారు. ఇరు దేశాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయన్నారు. ఈ క్రమంలో మిత్రదేశమైన
ఇజ్రాయెల్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే పైలట్లను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరించారు. “ఇజ్రాయెల్.. ఆ బాంబులను వేయొద్దు. అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనే. మీ పైలట్లను తక్షణమే వెనక్కి రప్పించండి” అని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి తొలిసారి ఇజ్రాయెల్‌కు వార్నింగ్ ఇచ్చారు.
READ MORE: Banakacherla: బనకచర్లపై కేబినెట్‌లో కీలక చర్చ.. మనం కౌంటర్ ఇవ్వాలి..!
మిత్రదేశంగా భావించే ఇజ్రాయెల్‌పై ట్రంప్ తొలిసారిగా ఫైర్ అయ్యారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన ట్రంప్.. “కాల్పుల విరమణ తర్వాత ఇరు దేశాలు పరస్పరం మళ్లీ దాడులు చేసుకున్నాయి. ఇరాన్‌తోపాటు ఇజ్రాయెల్ కూడా కాల్పుల విరమణను ఉల్లంఘిచింది. ఇజ్రాయెల్ చర్యలను నేను వ్యతిరేకిస్తున్నాను. టెల్ అవీవ్ శాంతించాలని నేను కోరుకుంటున్నాను.” తెలిపారు. ఈ మీడియాతో ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే ట్రంప్ మరో ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయబోదని.. అన్ని విమానాలు తిరిగి వెనక్కి వచ్చేస్తాయని పేర్కొన్నారు. కాల్పుల విరమణ కొనసాగుతోందని స్పష్టం చేశారు.
READ MORE: CM Revanth Reddy: నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగులు ధర్నా చేస్తున్నారు..