Muslim Countries Alliance: ఇజ్రాయెల్‌కు చెక్ పెట్టడానికి సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్ కొత్త కూటమి ఏర్పాటు చేయనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ మూడు ముస్లిం దేశాలు కొత్త కూటమి ఏర్పాటు చేయవచ్చని అన్నారు. ఇరాన్ ఇప్పటికే దీని కోసం ప్రయత్నాలను ప్రారంభించిందని వెల్లడించారు. ఈ మూడు దేశాలు కలిసి వస్తే, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఆధిపత్యం బలహీనపడుతుందని స్పష్టం చేశారు.
READ ALSO: Suzuki Vision e-Sky: సుజుకి తన తొలి ఎలక్ట్రిక్ కారు విజన్ ఇ-స్కై ఆవిష్కరణ.. నానో సైజు, 270KM రేంజ్
మధ్యప్రాచ్యంలో కింగ్ మేకర్‌గా ఇజ్రాయెల్..
ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ నివేదికల ప్రకారం… ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ ఈ కూటమి ఏర్పాటులో భాగంగా టర్కీని ఆకర్షించడంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి కూడా టర్కీ నాయకులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. సౌదీ అరేబియాను ఆకర్షించడానికి ఇరాన్ కూడా ఇలాంటి ప్రయత్నాలే చేస్తోంది. హమాస్, హిజ్బుల్లా, హౌతీలు వంటి సంస్థలను బలహీనపరిచిన తర్వాత ఇజ్రాయెల్ ఇప్పుడు మధ్యప్రాచ్యంలో ఒక సూపర్ పవర్‌గా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ లెబనాన్, ఇరాక్, ఖతార్, సిరియా, ఇరాన్ వంటి దేశాలపై దాడి చేసింది. ఈ దాడుల కారణంగా ఇజ్రాయెల్ ప్రతిచోటా ఒక ప్రయోజనాన్ని పొందిందని అన్నారు. ఖతార్‌పై ఇజ్రాయెల్ దాడి తర్వాత, మధ్యప్రాచ్యంలోని దేశాలు కొత్త భద్రతా నిర్మాణాలను అభివృద్ధి చేయడంపై దృష్టిసారించాయి. ఇరాన్ దీనిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ 3 దేశాల శక్తి ఎంత..
* గ్లోబల్ ఫైర్‌పవర్ ప్రకారం.. టర్కీలో 600,000 మంది క్రియాశీల సైనిక సిబ్బంది ఉన్నారు. అలాగే 300,000 మంది రిజర్వ్‌లో ఉన్నారు. టర్కీలో 2,238 ట్యాంకులు, 1,000 ఫిరంగులు, 300 రాకెట్ ఫిరంగులు ఉన్నాయి. అదేవిధంగా17 యుద్ధనౌకలు, 13 జలాంతర్గాములు, 201 యుద్ధ విమానాలు సహా 1,000 కంటే ఎక్కువ విమానాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ మరొక కీలకమైన విషయం ఏమిటంటే టర్కీ నాటో సభ్యదేశం. దీంతో ఈ దేశం చాలా సురక్షితమైన దేశంగా మారింది.
* సౌదీ అరేబియాలో 157,000 మంది యాక్టివ్ డ్యూటీ దళాలు, 150,000 మంది పారామిలిటరీ సిబ్బంది ఉన్నారు. సౌదీ వైమానిక దళం (RSAF) వెయ్యికి పైగా విమానాలను కలిగి ఉంది. వీటిలో ముఖ్యమైనవి అమెరికా నుంచి కొనుగోలు చేసిన F-15E స్ట్రైక్ ఈగిల్, బ్రిటన్ నుంచి టోర్నాడో IDS, యూరప్ నుంచి కొనుగోలు చేసిన యూరోఫైటర్ టైఫూన్‌లు ఉన్నాయి. అదనంగా సౌదీ అరేబియా వద్ద 185 కి పైగా హెలికాప్టర్లు కూడా ఉన్నాయి. ఈ దేశం ఇటీవల పాకిస్థాన్‌తో రక్షణ ఒప్పందంపై కూడా సంతకం చేసింది. ఈ ఒప్పందంతో సౌదీ అరేబియాకు పాకిస్థాన్ అణు భద్రతకు హామీ కూడా ఇచ్చిందనే వార్తలు వచ్చాయి.
* ఇరాన్ వద్ద ప్రస్తుతం 580,000 మంది సైన్యం ఉంది. ఇది 200,000 మంది శిక్షణ పొందిన రిజర్వ్ సైనిక సిబ్బందిని కూడా కలిగి ఉంది. ఇరాన్ దాదాపు 3,000 బాలిస్టిక్ క్షిపణులను, రష్యా ఉపయోగిస్తున్న షాహెద్ డ్రోన్‌ను కలిగి ఉంది. ఒక పెద్ద యుద్ధం సంభవిస్తే ఇరాన్‌కు చైనా – రష్యా వంటి మిత్రదేశాల నుంచి సహాయం పొందవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
READ ALSO: Sandeep Reddy Vanga: గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పిన సందీప్ రెడ్డి వంగా..!