Hamas Atrocities: హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడ్డారు. 1200 మందిని చంపడంతో పాటు పలువురు ఇజ్రాయిలీలను బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అయితే, వీరు ఇజ్రాయిలీలపై బలవంతంగా జరిపిన అఘాయిత్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నా్యి.
ఇజ్రాయెల్‌పై దాడులను చేసేందుకు హమాస్ మిలిటెంట్లు గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి ప్రాంతాల్లో ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్‌ను ప్రారంభించింది.
ఆహారం కోసం ఎదురుచూస్తున్న చాలా మంది పాలస్తీయన్లపై ఇజ్రాయెల్ సైనికుల కాల్పుల్లో మరణించారు. ఈ దాడిలో దాదాపు 20 మంది మరణించడంతో పాటు 150 మందికి పైగా గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా స్ట్రిప్ నుండి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇజ్రాయెల్ దాడితో ధ్వంసమవుతున్న గాజాలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది.
Chile : దక్షిణ అమెరికాలోని చిన్న దేశమైన చిలీ ఇజ్రాయెల్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఏప్రిల్‌లో జరగనున్న అమెరికా అతిపెద్ద ఏరోస్పేస్ ఫెయిర్‌లో ఇజ్రాయెల్ కంపెనీలు పాల్గొనలేవని చిలీ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య నిరంతర యుద్ధం జరుగుతోంది. ఇదిలావుండగా.. ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో మంగళవారం జరిగిన క్షిపణి దాడిలో భారతీయ పౌరుడు మరణించాడు. మరో ఇద్దరు భారతీయులు గాయపడ్డారు. ఈ దాడి జరిగిన ఒక రోజు తర్వాత ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయ ప్రజలకు భద్రతా సలహాను జారీ చేసింది.
India: ఇజ్రాయిల్-హమాస్ పోరు నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇజ్రాయిల్‌లో ఉంటున్న భారతీయులకు మంగళవారం కీలక సూచనలను జారీ చేసింది. క్షిపణి దాడిలో భారతీయులు మరణించిన తర్వాత, ఈ ఆదేశాలు జారీ చేసింది. ‘‘ ప్రస్తుతం భద్రతా పరిస్థితులు, స్థానిక భద్రతా సలహాల దృష్ట్యా దక్షిణ సరిహద్దు ప్రాంతాల్లో పనిచేసే, సందర్శించే వారు ఇజ్రాయిల్ లోని సురక్షిత ప్రాంతాలకు మకాం మార్చాలని సూచించారు. రాయబార కార్యాలయం వారితో టచ్‌లో ఉంది. ఇజ్రాయిల్ అధికారులు మా పౌరులందరికీ భద్రత కల్పించాలి’’…
గత ఐదు నెలలుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ స్పందించారు. గాజా పరిస్థితిపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను కూడా ఆమె తీవ్రంగా ఖండించారు. దాదాపు ఐదు నెలలుగా గాజాలో జరుగుతున్న యుద్ధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రుచిరా కాంబోజ్ తెలిపారు.