శాశ్వత కాల్పుల విరమణ కోసం హమాస్ కొత్త ప్రతిపాదనలను పరిశీలిస్తున్న సమయంలో గాజాలో ఉద్రిక్తత కొనసాగుతోంది. దక్షిణ గాజా నగరం ఖాన్ యూనిస్‌లో అత్యంత భీకర పోరు కొనసాగుతోంది.
గాజాలో కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ వివాదం మధ్య ఇజ్రాయెల్ దళాల తాజా వ్యూహాలు బయటపడ్డాయి. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ రహస్య కార్యాచరణ ప్రణాళికలో భాగంగా.. దాని దళాలు పౌరులు, వైద్య సిబ్బంది వేషధారణలో ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలోని ఆసుపత్రిలోకి చొరబడి ముగ్గురు హమాస్ మిలిటెంట్లను హతమార్చారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కొనసాగుతునే ఉంది. ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలో ఇప్పటి వరకు 26 వేల మందికి పైగా మరణించారు. గాజా- ఇజ్రాయేల్ మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఖతార్ ప్రధాన మంత్రి మహ్మద్ బిన్ అబ్దుల్‌రహ్మాన్ అల్ థానీ మధ్యవర్త్వం వహిస్తున్నారు.
Missile Arrack: ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. తాజాగా నిన్న బ్రిటిష్ ఆయిల్ ట్యాంకర్ మార్లిన్ లువాండాని మిస్సైళ్లతో దాడి చేశారు. జనవరి 26 రాత్రి సమయంలో చమురు నౌక నుంచి ఇండియన్ నేవీకి ఎస్ఓఎస్ అందింది. ఈ నౌకలో 22 మంది భారతీయ సిబ్బంది, ఒక బంగ్లాదేశ్ వ్యక్తి ఉన్నారు.
Gaza War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై దక్షిణాఫ్రికా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ICJ) ఆశ్రయించింది. తాజాగా గాజా యుద్ధంపై ఐసీజే తీర్పు చెప్పింది. గాజాలో నరమేధాన్ని నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఇజ్రాయిల్‌ని ఆదేశించింది. గాజాలో ఇజ్రాయిల్ మరణహోమం నిర్వహిస్తోందన్న దక్షిణాఫ్రికా వాదనల్లో కొన్ని ఆమోదయోగ్యమైనవి ఉన్నాయని ఐసీజే అభిప్రాయపడింది. మానవతా సాయం, అత్యవసర సేవలను అందించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరింది.
Iran: మొన్నటి వరకు ఉత్తర కొరియా అమెరికాతో సహా వెస్ట్రన్ దేశాలకు సవాల్ విసురుతూ.. శాటిలైట్‌ని అంతరిక్షంలోకి పంపగా, తాజాగా ఇరాన్ తన శాటిలైట్ ‘సొరయా’ని విజయవంతంగా అంతరిక్షంలో ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(UNSC) ఆంక్షలను ధిక్కరించి ప్రయోగాన్ని చేపట్టింది. ఉపగ్రహ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించినట్లు ఇరాన్ ప్రకటించింది. తమ సోరయా శాటిలైట్‌ని భూ ఉపరితలం నుండి 750 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.
అక్టోబరు 7న ప్రారంభమైన ఇజ్రాయెల్-గాజా యుద్ధం ఆగిపోయే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. ఈ రక్తపాత సంఘర్షణలో మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే సమయంలో సుమారు 16 వేల మంది ఈ యుద్ధంలో మరణించారు.
ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న పరిస్థితులను భట్టి చూస్తుంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేలా కనిపిస్తుంది. మొదట రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది.. ఆ తర్వాత ఇజ్రాయెల్-హమాస్ వివాదం కొనసాగుతుంది.. ఇప్పుడు హౌతీ యెమెన్ యుద్ధం ఈ మూడు కారణాల వల్ల థర్డ్ వరల్డ్ వార్ రాబోతుందా? అనే పరిస్థితులతో ప్రపంచం మొత్తం టెన్షన్ పడుతుంది.
Israel: అక్టోబర్ 7నాటి హమాస్ దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై దాడులకు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరింత తీవ్రతరం చేస్తోంది. హమాస్ ఉగ్రవాదుల్ని పూర్తిగా తుదముట్టించే వరకు వదిలేది లేదని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వెల్లడించారు. ఇదే విషయాన్ని పలుమార్లు చెప్పారు. మరోవైపు తాజాగా నెతన్యాహూ మాట్లాడుతూ.. పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తించేది లేదని స్పష్టం చేశారు.