హమాస్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధానిని రెండు వైపులా చుట్టుముట్టారు. ఓ వైపు రఫాలో ఆపరేషన్ ప్రారంభించడంతో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు గాజా విషయంలో నెతన్యాహుతో సొంత ప్రభుత్వ మంత్రులే విరుచుకుపడుతున్నారు.
Israel: ఇండియా నుంచి ఇజ్రాయిల్‌కి ఆయుధాలను తీసుకెళ్తున్న నౌకను తమ నౌకాశ్రయంలో లంగరు వేయడానికి స్పెయిన్ అంగీకరించలేదు. మారియాన్ డానికా అనే డానిష్ జెండాతో ఉన్న ఓడకు అనుమతి నిరాకరించింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. దక్షిణ గాజా నగరమైన రఫాపై దాడి చేయవద్దని అమెరికా, ఇతర దేశాలు ఒత్తిడి చేస్తున్నా ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. రఫాలో పాలస్తీయన్ ప్రజలు ఖాళీ చేయాలని, సురక్షిత ప్రదేశాలకు వెళ్లిపోవాలని మరోసారి ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది.
గాజాలోని హమాస్ రాజకీయ విభాగం నాయకుడు, ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ వ్యక్తులలో ఒకరైన యాహ్యా సిన్వార్ రఫాలో లేరని, గాజా దక్షిణాన ఉన్న నగరంలో ఇజ్రాయెల్ తన దాడులతో ముందుకు సాగుతున్నప్పుడు ఇద్దరు అధికారులు చెప్పారు.
Sharia law: అమెరికా చట్టసభ సభ్యుడు రెప్ చిప్ రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూఎస్ హౌజ్ ఫ్లోర్‌లో మాట్లాడుతూ..అమెరికన్ సమాజంపై ‘‘షరియా చట్టాన్ని’’ విధించే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తం చేశారు.
Israel-Hamas War : ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) మంగళవారం ఈజిప్ట్, గాజా మధ్య రాఫా సరిహద్దు క్రాసింగ్‌ను స్వాధీనం చేసుకుంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు రఫాపై భూదాడి చేస్తామని హెచ్చరించిన కొద్ది గంటలకే ఇజ్రాయెల్ ట్యాంకులు రఫా సరిహద్దుకు చేరుకున్నాయి.
గాజాలో జరిగిన యుద్ధం సోమవారం పులిట్జర్ ప్రైజ్‌లలో ప్రముఖంగా ప్రదర్శించబడింది. ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణను కవర్ చేస్తున్న పాత్రికేయులు ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.
Benjamin Netanyahu : గాజాలో ఇజ్రాయెల్ సైనికుల ఊచకోతను ఆపడానికి అమెరికా, నాలుగు ముస్లిం దేశాలు ఏకమయ్యాయి. సౌదీ అరేబియాలో ఇటీవల జరిగిన సమావేశంలో.. గాజాలో త్వరలో కాల్పుల విరమణ జరగాలని ఉద్ఘాటించారు.
ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం జరిగినప్పటి నుంచి యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారు. మరోవైపు హిందూ మహా సముద్రంలో నౌకలపై హౌతీ రెబల్స్ దాడులు పెంచారు.