Israel: ఇజ్రాయెల్‌పై దాడులను చేసేందుకు హమాస్ మిలిటెంట్లు గాజాలోని అల్-షిఫా ఆసుపత్రి ప్రాంతాల్లో ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు.. ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఉగ్రవాదులే లక్ష్యంగా ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇంటెలిజెన్స్ పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్‌ను చేపట్టామని, పౌరులకు హాని చేయడం కంటే హమాస్ మిలిటెంట్లను ఎదుర్కోవడమే లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రతినిధి ఒకరు సోమవారం తెల్లవారుజామున తెలిపారు.
Read Also: Sidhu Moosewala Mother: 58 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన సిద్దూ మూసేవాలా తల్లి
“హమాస్‌కు చెందిన సీనియర్ ఉగ్రవాదులు అల్-షిఫా ఆసుపత్రిలో మళ్లీ గుమిగూడారని, ఇజ్రాయెల్‌పై దాడులకు ఆదేశిస్తున్నారని మాకు తెలుసు” అని డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ప్రతినిధి హగారి చెప్పారు. పౌర ప్రాణనష్టాన్ని తగ్గించడానికి ఆపరేషన్ ఖచ్చితత్వంతో, జాగ్రత్తగా నిర్వహించబడుతుందని ఆయన చెప్పారు. రోగులు, వైద్య సిబ్బంది ఆస్పత్రిని ఖాళీ చేయాల్సిన అవసరం లేదని, వదిలి వెళ్లాలనుకున్నా ఒక మార్గం అందుబాటులో ఉందన్నారు. ఆసుపత్రి కాంపౌండ్‌లో రోగులకు సహాయం చేయడానికి అరబిక్ మాట్లాడేవారిని, వైద్య సిబ్బందిని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నియమించిందని చెప్పారు. పౌరులకు మానవతా సహాయం అందిస్తోందని వెల్లడించారు. వైద్య సదుపాయాలను ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించకూడదని చెబుతూ హమాస్ ఉగ్రవాదులు లొంగిపోవాలని పిలుపునిచ్చారు. “వైద్య సౌకర్యాలను టెర్రరిజం కోసం ఉపయోగించుకోకూడదు. హమాస్ తప్పనిసరిగా జవాబుదారీగా ఉండాలి” అని హగారి తన చిన్న వీడియో సందేశాన్ని ఇజ్రాయెల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ చేసారు.
Read Also: Rahul Gandhi : ‘జైట్లీ నా వద్దకు వచ్చి.. భూసేకరణపై మాట్లాడకండి అన్నారు’.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు
ఇంతలో గాజాలోని హమాస్-నియంత్రిత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొనసాగుతున్న ఇజ్రాయెల్ ఆపరేషన్‌పై ఒక ప్రకటన విడుదల చేసింది, “అల్-షిఫా మెడికల్ కాంప్లెక్స్‌లోని వైద్య సిబ్బంది, రోగులు, ఎక్కడి నుంచో వ్యక్తుల జీవితాలకు ఇజ్రాయెల్ బాధ్యత వహిస్తుంది” అని పేర్కొంది. ఈ దళాలు చేస్తున్న ఆక్రమణ.. అంతర్జాతీయ మానవతా చట్టాలను ఉల్లంఘించడమేనని ఈ ప్రకటనలో పేర్కొంది.