Gaza War: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడికి పాల్పడి 1200 మందిని చంపేయడంతో పాటు 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ ఆర్మీ గాజాతో పాటు పాలస్తీనా భూభాగాలపై విరుచుకుపడుతోంది. గాజా స్ట్రిప్‌తో పాటు వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లోని హమాస్ స్థావరాలు, మిలిటెంట్లు లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్‌ని పూర్తిగా నిర్మూలించే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని పలు సందర్భాల్లో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు.…
ఇజ్రాయెల్- హమాస్ మధ్య వచ్చే సోమవారానికి కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఆ దిశగా కొనసాగుతున్న చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు.
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తన పదవికి ఇవాళ రాజీనామా చేసారు. దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు తన రాజీనామాను సమర్పించినట్లు పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తెలిపారు.
Israel-Hamas War: ఇజ్రాయిల్ హమాస్ మిలిటెంట్ల దాడి సాధారణ పాలస్తీనియన్లను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టేసింది. అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని దారుణంగా చంపేసింది. మరికొందరిని బందీలుగా గాజాలోకి పట్టుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజాపై ఇజ్రాయిల్ విరుచుకుపడుతోంది. ఇప్పటివరకు మరణాల సంఖ్య 30,000లను దాటింది. ఇదిలా ఉంటే ఇప్పుడు గాజాలోని ప్రజలు ఆకలితో దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. ఆహారం, మందులు లేక విలవిల్లాడుతున్నారు. ఉత్తర గాజా నుంచి వేల మంది పాలస్తీనియన్లు…
Port workers union: గాజా యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయిల్, పాలస్తీనాలకు సైనిక సామాగ్రితో వెళ్లే ఓడల్ని నిర్వహించకూడదని పోర్ట్ వర్కర్స్ యూనియన్ తమ సభ్యులకు పిలుపునిచ్చింది. దేశంలోని 11 ప్రధాన ఓడరేవుల్లో 3500 మందికి పైగా కార్మికులకు ప్రాతినిధ్య వహిస్తున్న వాటర్ ట్రాన్స్‌పోర్స్ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయిల్-పాలస్తీనాలకు సైనిక సామాగ్రిని తీసుకెళ్లే మరే ఇతర దేశం నుమచి ఆయుధ కార్గోలను లోడ్ చేయడం లేదా అన్ లోడ్ చేయడం లేదని…
S Jaishankar: పాలస్తీనా సమస్యకు టూ స్టేట్ పాలసీని భారత్ అనేక దశాబ్ధాలుగా కొనసాగిస్తోందని, అనేక దేశాలు దీన్ని ఆమోదించాయని, ప్రస్తుతం ఇది అత్యవసరమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. గాజాలో ప్రస్తుత పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరియు జర్మనీ విదేశాంగ మంత్రి అన్నలెనా బేర్‌బాక్ సమక్షంలో మ్యూనిచ్‌లో జరిగిన భద్రతా సదస్సులో ఇంటరాక్టివ్ సెషన్‌లో ఎస్ జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Israel: అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని హత్య చేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్, పాలస్తీనా భూభాగాలైన వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌లపై తీవ్రంగా దాడులు చేస్తోంది. హమాస్-ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఇప్పటికే 28,700 మందికి పైగా మరణించారు. మరోవైపు యుద్ధం నిలిపేయాలని ఇజ్రాయిల్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి వస్తున్నటప్పటికీ.. హమాస్‌ని పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపబోమని ఇప్పటికే ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ పలుమార్లు స్పష్టం చేశారు.
ఇద్దరు బందీలను కాపాడేందుకు దక్షిణ గాజాలోని రఫా సరిహద్దులో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 63 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ విషయాన్ని రఫా ఆస్పత్రి అధికారులు పేర్కొన్నారు.
Israeli Attack : రఫాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 44 మంది పాలస్తీనియన్లు మరణించారు. కొన్ని గంటల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ... భూమి దాడికి ముందు దక్షిణ గాజా నగరం నుండి వేలాది మంది ప్రజలను తరలించడానికి ఒక ప్రణాళికను రూపొందించాలని సైన్యాన్ని కోరినట్లు చెప్పారు.
Gaza War: హమాస్ అంతాన్ని చూసే దాకా ఇజ్రాయిల్ గాజాలో యుద్ధాన్ని ఆపేలా కనిపించడం లేదు. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్‌పై దాడి చేసి 1200 మందిని చంపేశారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ పాలస్తీనా భూభాగాలైన గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్‌పై విరుచుకుపడుతోంది. హమాస్ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. హమాస్ అంతమయ్యేదాకా యుద్ధాన్ని విరమించేంది లేదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ పలు సందర్భాల్లో వెల్లడించారు.