వెనిజులాకు ట్రంప్ మరో స్ట్రాంగ్ వార్నింగ్ జారీ చేశారు. తక్షణమే చైనా, రష్యా, ఇరాన్, క్యూబాతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని డెల్సీ రోడ్రిగ్జ్ నేతృత్వంలోని వెనిజులా ప్రభుత్వానికి ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు.
Iran Protests: వెనిజులా సైనిక చర్య నేపథ్యంలో, అమెరికా ఇరాన్లో ఏదైనా సైనిక చర్య చేపడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే, ఇరాన్ వ్యాప్తంగా ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం, ప్రభుత్వంపై ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నారు. ఇప్పటికే, ఈ అల్లర్లలో 30 మందికి పైగా చనిపోయారు. మరోవైపు, బలవంతంగా ఇరాన్ ప్రభుత్వం, నిరసనకారులపై కాల్పులు జరిపితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా ఇప్పటికే ప్రకటించింది.
ఇరాన్లో నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. గత రెండు వారాలుగా ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే ఆందోళనలను చక్కదిద్దడంలో భద్రతా దళాలు వైఫల్యం చెందినట్లుగా తెలుస్తోంది.
ఇరాన్లో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. టెహ్రాన్‌లో పరిపాలనా భవనం దగ్గరకు నిరసనకారులు రావడంతో భద్రతా దళాలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 16 మంది ఆందోళనకారులు మృతిచెందారు.
US-Venezuela War: వెనిజులాపై ఈ రోజు అమెరికా భీకర దాడులు చేసింది. రాజధాని కారకస్‌పై బాంబుల వర్షం కురిపించింది. ఏం జరుగుతుందో తెలిసే లోపే, ట్రంప్ బాంబ్ పేల్చాడు. తాము వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్యను తాము నిర్బంధించామని, యూఎస్‌కు తీసుకువస్తున్నట్లు ప్రకటించడంతో ప్రపంచం షాక్ అయింది. అయితే, ఈ దాడులపై ప్రపంచ దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. క్యూబా, అర్జెంటీనా, కొలంబియా వంటి లాటిన్ అమెరికా దేశాలతో పాటు రష్యా, ఇరాన్‌లు…
ఇరాన్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. షియా మతాధికారుల కోట అయిన కోమ్కు చేరుకున్నాయి.
Iran: ఇరాన్లో మూడేళ్ల తర్వాత మరోసారి భారీ స్థాయిలో ‘‘ఇస్లామిక్ పాలన’’కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. 2022-23లో మహ్సా అమిని హిజాబ్ వేసుకోలేదని అక్కడి మెరాలిటీ పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. ఆ తర్వాత ఆమె చనిపోయింది.
ఇరాన్లో నకిలీ ఉద్యోగ ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలంటూ భారతీయులకు కేంద్రం హెచ్చరించింది. క్రిమినల్ ముఠాలు తప్పుడు ఉద్యోగ హామీలతో వ్యక్తులను ఆకర్షించి కిడ్నాప్‌లకు పాల్పడుతున్నారని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రకటనలకు భారతీయులెవరూ బలికావొద్దని.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని భారత విదేశాంగ కోరింది.
హౌతీయుల లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకరదాడులు చేసింది. యెమెన్ రాజధాని సనాలో అధ్యక్ష భవనం సమీపంలో ఇంధన గిడ్డంగి, రెండు విద్యుత్ కేంద్రాలు లక్ష్యంగా ఐడీఎఫ్ దాడి చేసింది.