Iran-US: ఇరాన్‌కు ఏదైనా జరిగితే.. ఆ తర్వాత సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ట్రంప్‌కు ఖమేనీ వార్నింగ్
- ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు
- ఇరాన్‌కు ఏదైనా జరిగితే.. ఆ తర్వాత సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి
- ట్రంప్‌కు ఖమేనీ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇరాన్‌లో ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిన నిరసనల్లో దాదాపు 30 వేల మంది చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులకు ఏదైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్ సమీపంలో మోహరిస్తున్నాయి. యూఎస్ఎస్ అబ్రహం లింకన్ యుద్ధ నౌక టెహ్రాన్ సమీపంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఏదో క్షణంలో ఇరాన్‌పై అమెరికా దాడి చేయొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: వరల్డ్‌లో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడమే లక్ష్యం.. నిర్మలమ్మ బడ్జెట్‌పై మోడీ వ్యాఖ్య
Also Read
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
ఈ నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అమెరికాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాపై చేసే ఏ దాడైనా మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా నావికాదళ మోహరింపు, ఈయూ మిలిటరీలను ఉగ్రవాద గ్రూపులుగా పేర్కొన్న తర్వాత ఉద్రిక్తలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ ఈ ప్రకటన చేశారు. ‘‘మేము ప్రేరేపకులం కాదు. మేము ఏ దేశంపైనా దాడి చేయాలని కోరుకోవడం లేదు. కానీ ఇరాన్ దేశంపై దాడి చేసినా లేదా వేధించినా వారికి గట్టి దెబ్బ తగులుతుంది.’’ అని ఖమేనీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: TTD EO: టీటీడీ ఈవో గా ముద్దాడ రవిచంద్ర.. అనీల్ కుమార్ సింఘాల్ పై బదిలీ వేటు
అయితే ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తుందా? లేదా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. ఇక అమెరికాతో యుద్ధం కోరుకోవడం లేదని ఇరాన్ అంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా నిర్ణయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా ఉంది. ఇదిలా ఉంటే ఆది, సోమవారాల్లో ఇరాన్ వ్యూహాత్మక హార్ముజ్ జలసంధిలో లైవ్-ఫైర్ మిలిటరీ డ్రిల్‌ను ప్లాన్ చేసింది. ఇది పర్షియన్ గల్ఫ్ ఇరుకైన ముఖద్వారం. దీని ద్వారా మొత్తం చమురు వ్యాపారంలో ఐదవ వంతు వెళుతుంది. ఈ డ్రిల్ సమయంలో అమెరికన్ యుద్ధనౌకలు లేదా విమానాలను బెదిరించవద్దని లేదా వాణిజ్య ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని యూఎస్ మిలిటరీ సెంట్రల్ కమాండ్ హెచ్చరించింది.
తాజావార్తలు
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
-
Harmanpreet Kaur: ప్రతిసారి నేనున్నానని ముందుకొస్తుంది.. వికెట్స్ తీస్తుంది.. హర్మన్‌ప్రీత్ సంతోషం!
-
Sanju Samson: సంజు శామ్సన్ ఉదారత.. 1,000 మంది యూపీఎస్సీ అభ్యర్థులకు స్కాలర్షిప్లు..
-
Ravi Mohan: ప్రియురాలిగా వార్తల్లో నిలిచిన కెనీషానే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్..
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!