Israel- Iran Conflict: ఇరాన్‌తో యుద్ధ సమయంలో ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హత్య చేసేందుకు బాగా వెతికామని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఖట్జ్ ప్రకటించారు. కానీ, తమకు సరైన అవకాశం లభించక పోవడంతో అందులో విఫలమైనట్లు తెలిపాడు.
Iran: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత తొలిసారిగా ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. సంఘర్షణ తర్వాత తన తొలి బహిరంగ ప్రసంగంలో ఖమేనీ గురువారం మాట్లాడుతూ.. ఇజ్రాయిల్‌పై తాము విజయం సాధించామని, ఇజ్రాయిల్‌ని కాపాడాలని అండగా వచ్చిన అమెరికా ముఖంపై చెంప దెబ్బ కొట్టామని అన్నారు. ఇరాన్ అణు స్థావరాలకు పెద్దగా నష్టం జరగలేదని, అమెరికా పెద్దగా ఏం సాధించలేకపోయిందని చెప్పారు.
విదేశీ ముఠాలు లేదా మోసాద్ లాంటి గూఢచార సంస్థలు ఆయనపై దాడికి సిద్ధమవుతున్నట్లు టెహ్రాన్ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఈ పరిస్థితుల్లో అలీ ఖమేనీ మరో దేశానికి తాత్కాలికంగా వెళ్లి తలదాచుకోవాలని యోచిస్తున్నట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదికలో పేర్కొంది.
Ayatollah Ruhollah Khomenei: మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయిల్-ఇరాన్ సంక్షోభం ప్రపంచదేశాలను భయపెడుతోంది. అమెరికా జోక్యం ఉండటంతో ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారుతుందా..? అనే అనుమానాలు నెలకున్నాయి. మరోవైపు, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ట్రంప్, ఇజ్రాయిల్‌కి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తాము ఎవరికీ లొంగేది లేదని, యుద్ధం మొదలైందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Iran: ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘‘ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదు. అమెరికా సైనిక జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం జరుగుతుంది’’ అని హెచ్చరించారు. అంతకుముందు రోజు ట్రంప్ తన ట్రూత్ సోషల్ ద్వారా ‘
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత తీవ్రంగా ముదురుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మొదలైన యుద్ధంలోకి ఇప్పుడు అగ్ర రాజ్యం అమెరికా కూడా ప్రవేశించబోతుంది. ఈ మేరకు ట్రంప్ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్.. ఇరాన్‌పై భీకర దాడులు మొదలు పెట్టింది. అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది.
Israel Iran War: ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. శుక్రవారం, ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయిల్ ఇరాన్ వ్యాప్తంగా భారీ దాడులు నిర్వహించింది. ముఖ్యంగా, ఇరాన్ అణు కార్యక్రమాలు జరిగే చోట్లతో పాటు ఇరాన్ టాప్ మిలిటరీ జనరల్స్‌ని, అణు శాస్త్రవేత్తల్ని హతమార్చింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ పైన ఇరాన్ వందలాది మిస్సైళ్లను ప్రయోగించింది.
Iran Supreme Leader: హమాస్, హెజ్బొల్లా, ఇస్లామిక్ జిహాద్‌లు తమ ముసుగు సంస్థలు కావు.. అవి స్వచ్ఛందంగా పోరాటం చేస్తున్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ వెల్లడించారు.