ఇరాన్‌లో నిరసనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. గత రెండు వారాలుగా ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు చేస్తున్నారు. అయితే ఆందోళనలను చక్కదిద్దడంలో భద్రతా దళాలు వైఫల్యం చెందినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ (86) 20 మంది సహాయకులు, కుటుంబ సభ్యులతో మాస్కోకు పారిపోయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు నిఘా వర్గాలు పేర్కొన్నట్లు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Trump: వెనిజులా భవిష్యత్ ప్రణాళిక వెల్లడించిన ట్రంప్.. ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు
అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో మరింత హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు అయతుల్లా ఖమేనీ టెహ్రాన్ నుంచి రష్యాకు పారిపోవడానికి అత్యవసర ప్రణాళిక రచించుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చినట్లు సమాచారం. ఇప్పటికే భద్రతా దళాల కాల్పుల్లో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయాలు పాలయ్యారు. పరిస్థితులు చేదాటిపోతున్నాయన్న భావనతో అయతుల్లా ఖమేనీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ ‘మన శంకర వరప్రసాద్ గారు‘ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతో తెలుసా?
ఇదిలా ఉంటే నిరసనకారులను అడ్డుకోవడంలో సైన్యం, భద్రతా దళాలు ప్రభుత్వ ఆదేశాలను తిరస్కరిస్తున్నట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగా ఖాతర్ చేయట్లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖమేనీ రష్యాకు వెళ్లిపోయాక ‘ప్లాన్ బీ’ ప్రకారం కుమారుడు మోజ్తాబాను వారసుడిగా రంగంలోకి దింపాలని ప్రణాళిక వేసినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు నిరసనకారులపై జులుం ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఇప్పటికే ఇరాన్‌ను అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. నిరసనకారులు చనిపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. హింసాత్మకంగా మారితే అమెరికా రంగంలోకి దిగాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.
ఇదిలా ఉంటే అయతుల్లా ఖమేనీ రష్యాకు పారిపోతున్నట్లు వస్తున్న వార్తలను భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఖండించింది. అది పూర్తిగా అవాస్తవం అని కొట్టిపారేసింది. శత్రు దేశాలు వ్యాప్తి చేస్తున్న అబద్ధ ప్రచారం అని తోసిపుచ్చారు. ఇజ్రాయెల్‌తో 12 రోజుల పాటు యుద్ధం జరిగినప్పుడు కూడా ఖమేనీ ఎక్కడికి పారిపోలేదని.. ఇప్పుడెందుకు పారిపోతారని చెప్పుకొచ్చారు. అదంతా అబద్ధం అని కొట్టేపారేశారు.