Trump-Iran: నేడు అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు.. పరోక్షంగా పాల్గొననున్న ట్రంప్
- నేడు అమెరికా-ఇరాన్ మధ్య అణు చర్చలు
- స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో సమావేశం
- పరోక్షంగా పాల్గొననున్న ట్రంప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా-ఇరాన్ మధ్య మంగళవారం కీలక చర్చలు జరగనున్నాయి. మరోసారి అణు ఒప్పందంపై రెండు దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఇరు దేశాల మధ్య మంగళవారం చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ జెనీవాకు చేరుకున్నారు. మంత్రితో పాటు ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం వెళ్లింది. అమెరికా బృందం కూడా చేరుకుంది. ఈ చర్చల్లో పరోక్షంగా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాల్గొంటారని వార్తలు వినిపిస్తున్నాయి. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: Tarique Rahman: నేడు బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణస్వీకారం.. హాజరుకానున్న ఓం బిర్లా
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
ఇదిలా ఉంటే చర్చలకు ముందు అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం అంత సులభం కాదని వ్యాఖ్యానించారు. క్షిపణి కార్యక్రమంపై కూడా చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తొలి విడత చర్చలు ఒమన్‌లో జరిగాయి. అప్పుడు పెద్ద పురోగతి లభించలేదు. ఈసారైనా ఫలిస్తుందో లేదో చూడాలి. ఒకవేళ చర్చలు కొలిక్కి రాకపోతే మాత్రం మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: AP New DWCRA Schemes 2026: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. మార్చి 8న రెండు కొత్త పథకాల ప్రారంభం!
సోమవారం ఇరాన్ విదేశాంగ మంత్రి జెనీవాలో యూఎన్ అణు వాచ్‌డాగ్ అధిపతితో సమావేశమయ్యారు. చర్చలకు ముందు సమావేశం జరిగినప్పటికీ అణు ఒప్పందంపై నిర్దిష్ట చర్యలు తీసుకున్నట్లు ఇరువైపుల నుంచి స్పష్టమైన సంకేతాలు కనిపించలేదు. ఇక చర్చలను అణు వరకే పరిమితం చేయాలని ఇరాన్ పట్టుబడుతున్నట్లు కనిపిస్తోంది. క్షిపణితో పాటు ఇతర అంశాలపై చర్చించబోమని చెబుతున్నట్లుగా సమాచారం. జీరో-యురేనియం సుసంపన్నం, ఇతర కార్యక్రమాలపై చర్చించబోమని ఇరాన్ స్పష్టం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జెనీవాలో జరిగే చర్చలు కూడా ఫలిస్తాయో లేదో అన్న సందిగ్ధం నెలకొంది. ఇప్పటికే అమెరికా యుద్ధ నౌకలు అరేబియా సముద్రంలో మోహరించాయి. ఒకవేళ చర్చలు ఫలించకపోతే ఇరాన్‌లో అశాంతి నెలకొనే పరిస్థితులు ఉంటాయి.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?