బ్యాటింగ్ వైఫల్యంతోనే గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధోని.. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రేట్ రొటేట్ చేయడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని.. ఆ తప్పిదమే తమ ఓటమిని శాసించిందని ధోని చెప్పుకొచ్చాడు.
ఆర్సీబీ-లక్నో మ్యాచ్ కూడా ఆ రేంజ్ లోనే సాగింది. 1 కోటి రియల్ టైమ్ వ్యూస్.. ఏకంగా 1.8 కోట్లకు చేరుకుంది. ఐపీఎల్ లో ఇదే అత్యధికం.. ఇంతకు ముందు లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో వచ్చి 3 బంతుల్లో 2సిక్సర్లు కొట్టి అవుట్ అయిన ఎంఎస్ ధోని బ్యాటింగ్ చేసే టైంలో జియో రియల్ టైం వ్యూస్ 1.7 కోట్లను తాకింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌పై 204 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఆఖరి ఓవర్‌లో 5 వరుస సిక్సర్లు బాదిన రింకూ సింగ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఫినిషింగ్ లైన్‌పైకి తీసుకెళ్లిన తర్వాత కోల్‌కతా నైట్ రైడర్స్ గత సీజన్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశాడు.
ఐపీఎల్ 2023 సీజన్ లో గత రెండు రోజులలో జరిగిన మ్యాచ్ ల్లో సీనియర్ ఆటగాళ్లు సత్తా చాటి.. అదిరిపోయే కమ్ బ్యాక్ చేస్తున్నారు. ఎవరూ ఊహించనట్టుగా.. ఎలాంటి అంచనాలు లేని సీనియర్లు.. బ్యాటు. బాల్ తో మెరిసి మ్యాజిక్ చేస్తున్నారు. దీంతో 2023లో కమ్ బ్యాక్ ఇయర్ గా అభివర్ణిస్తున్నారు.
హైదరాబాద్ ప్రజలు నన్ను ఇంకా గుర్తుపెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది.. ఇది నా కెరీర్ లోనే బెస్ట్ ఇన్సింగ్స్ అనుకుంటున్నా.. ఎస్ ఆర్ హెచ్ పై 99 పరుగుల ఇన్సింగ్స్ తో ధావన్ కోహ్లీ రికార్డును బద్దులు కొట్టాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యా్చ్ లో పేసర్ దీపక్ చాహర్‌ను కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్ శనివారం చేదు అనుభవం ఎదుర్కొంది.
సన్ రైజర్స్ హైదరాబాద్-పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. ఇరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకుని ప్రాక్టీస్ చేస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్ రాత్రి 11.30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉప్పల్ తో పాటు వరంగల్ రహదారిపై కూడా పోలీసులు ట్రాపిక్ ఆంక్షలు పెట్టారు. పలు మార్గాల్లో మధ్యాహ్నం ట్రాఫిక్ మళ్లీంచనున్నారు.
రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో వార్నర్ 56 బంతులలో 65 రన్స్ స్కోర్ చేశాడు. అలా ఐపీఎల్ లో 6 వేల పరుగుల మైలు రాయిని అధిగమించాడు. ఇక వార్నర్ కంటే ముందు ఈ లిస్ట్ లో టీమ్ ఇండియాకు చెందిన విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ఇవాళ బిగ్ ఫైట్ జరుగబోతుంది. గుజరాత్ టైటాన్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ ఢీ కొట్టబోతుంది. ఈ అసలు సిసలైన పోరుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చెడు సమయాన్ని ఎలా అధిగమించాలో వివరిస్తారు. వైఫల్యాన్ని నివారించడం మరియు విజయాల నిచ్చెన ఎలా అధిరోహించాలి అని మహేంద్ర సింగ్ ధోని మంత్రం సూర్య చెవులకు చేరింది.