ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో ఇవాళ బిగ్ ఫైట్ జరుగబోతుంది. గుజరాత్ టైటాన్స్ ను కోల్ కతా నైట్ రైడర్స్ ఢీ కొట్టబోతుంది. ఈ అసలు సిసలైన పోరుకు క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ రెండు విజయాలతో మంచి ఊపుమీద కనిపిస్తుంటే.. కోల్ కతా మాత్రం ఒక మ్యాచ్ ఓటమిని చవిచూసి.. తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి విజయంతో వస్తుంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి కేవలం 19 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీస్తే ఢిల్లీ గల్లీ పోరడు సూయష్ శర్మ మాత్రం రెచ్చిపోయి 3 వికెట్లు తీశాడు. విండీస్ స్టార్ క్రికెటర్ సునీల్ నరైన్ సైతం సత్తా చాటాడు. బ్యాటింగ్ లో మొదట తడబడిన శార్దుల్ ఠాకూర్ దుమ్ము రేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ప్రస్తుతం ఆర్సీబీ విజయంతో కోల్ కతా నైట్ రైడర్స్ బలమైన గుజరాత్ టైటాన్స్ ను ఢీ కొనబోతుంది.
Also Read : IPL 2023 : ఓటమి తర్వాత మొహం చాటేసిన రోహిత్ శర్మ
ఇక హర్ధిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ వరుస విజయాలతో ఊపు మీదుంది. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో ఆధిపత్యం వహిస్తోంది. ఎక్కడ తగ్గడం లేదు. ముందు మైదానంలోకి దిగితే భారీ టార్గెట్ ను ప్రత్యర్థి ముందు ఉంచుతోంది. ఒకవేళ ప్రత్యర్థి జట్టు గనుక ఎక్కవు పరుగులు చేసినా లక్ష్య ఛేధనలో దుమ్మురేపుతుంది. అంతే కాదు బౌలింగ్ పరంగా కట్టడి చేస్తోంది. మొత్తంగా ఇవాళ ఇరు జట్ల మధ్య జరిగే మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. ఈ ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారనే దానిపై టెన్షన్ నెలకొంది.
Also Read : Diet risk: అతిగా ఆశ పడకండి.. ప్లీజ్ తినడం మానేయకండి